Munugode Bypoll: మునుగోడులో ప్రచారంపై క్లారిటీ ఇచ్చేసిన వెంకట్‌రెడ్డి.. కరెక్టుగా బైపోల్‌ టైమ్‌లో విదేశాలకు

మునుగోడు ఉప ఎన్నికలో వేడెక్కిన ప్రచారం.. పాలకప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలు.. ఆరోపణలు,ప్రత్యారోపణలు.. ఇవన్నీ పక్కనపెడితే.. కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరైన వెంకట్‌రెడ్డి వ్యవహారం.. ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Munugode Bypoll: మునుగోడులో ప్రచారంపై క్లారిటీ ఇచ్చేసిన వెంకట్‌రెడ్డి.. కరెక్టుగా బైపోల్‌ టైమ్‌లో విదేశాలకు
MP Komatireddy Venkat Reddy
Follow us

|

Updated on: Oct 09, 2022 | 6:05 PM

ఇంతకీ అన్నయ్య ఏం డెసిషన్‌ తీసుకున్నారు? తమ్ముడికి ఫేవరా? పార్టీకి షాకిచ్చారా?… కోమటిరెడ్డి బ్రదర్స్‌.. తెలంగాణ రాజకీయాల్లో వీళ్లిద్దర్నీ వేరు చేసి చూడలేం. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ కోసం పనిచేసిన ఈ ఇద్దరు అన్నదమ్ములు.. ఇప్పుడు చెరో పార్టీ అయిపోయారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోగా… వెంకట్‌రెడ్డి మాత్రం హస్తంపార్టీలోనే కొనసాగుతున్నారు. దీంతో, మునుగోడు ఉప ఎన్నిక విషయంలో వెంకట్‌రెడ్డి ఎలా వ్యవహరిస్తారనే సస్పెన్స్‌ కొనసాగింది. అసలే ఆయన కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కావడంతో.. సిట్యువేషన్ ఇంకాస్త రసవత్తరంగా మారింది.

పార్టీకి విధేయుడిగా ఉంటారా? తమ్ముడికి మద్దతిస్తారా? అనే సస్పెన్స్‌కు తెరదించుతూ… కీలక నిర్ణయం తీసుకున్నారు వెంకట్‌రెడ్డి. నొప్పించక, తానొప్పక అన్నట్టు… కరెక్టుగా మునుగోడు ఉప ఎన్నిక సమయంలో విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఈనెల 15న ఫారిన్‌ ట్రిప్‌కు వెళ్తున్నారు. మళ్లీ బైపోల్‌ ఫలితాల తర్వాతే ఇండియాకు తిరిగి రానున్నారు. రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ను వీడినప్పట్నుంచీ… వెంకట్‌రెడ్డి తీరుపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. తమ్ముడి దారిలోనే అన్న కూడా వెళ్తారనే ప్రచారమూ జరిగింది. ఈ విషయంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో వెంకట్‌రెడ్డికి పెద్ద యుద్ధమే జరిగింది. అయితే, పీసీసీ మాత్రం.. వెంకట్‌రెడ్డి తమతోనే ఉన్నారనీ.. సమయం చూసుకుని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని చెబుతూ వస్తున్నారు.

కాగా, ఇప్పటివరకు మునుగోడు సంబంధించిన ఏ కాంగ్రెస్ మీటింగ్‌లోనూ వెంకట్‌రెడ్డి కనిపించలేదు. దీంతో, ఆయన వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తిరేపింది. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ.. ఈ ఉప ఎన్నికల తతంగమంతా ముగిసేదాక ఫారిన్‌ టూర్‌ ప్లాన్‌ చేసుకున్నారు. దీంతో, తన వైఖరిపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చేసినట్టయ్యింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..