KTR: గుజరాత్ ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్.. జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి రిక్వెస్ట్..

కేంద్రప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలన పై విమర్శలు గుప్పించే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీకి ఓ రిక్వెస్ట్ చేశారు. గుజరాత్ లో 10ఏళ్ల కిందట జరిగిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో..

KTR: గుజరాత్ ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్.. జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి రిక్వెస్ట్..
Minister Ktr
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2022 | 3:38 PM

KTR: కేంద్రప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలన పై విమర్శలు గుప్పించే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీకి ఓ రిక్వెస్ట్ చేశారు. గుజరాత్ లో 10ఏళ్ల కిందట జరిగిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. రెవిషన్ విధానం కింద ఖైదీలను విడుదల చేస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈవిషయంలో స్పందించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ట్విట్టర్ ద్వారా కోరారు. మహిళలను గౌరవించాలంటూ మీరు చెప్పే మాటలపై మీకు చిత్తశుద్ధి ఉంటే.. గుజరాత్ ప్రభుత్వ రెవిషన్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని మంత్రి కేటీఆర్ కోరారు. రెవిషన్ ఉత్తర్వులు రద్దు చేయించి.. దేశం పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కేంద్ర హోం శాఖ ఆదేశాలకు వ్యతిరేకంగా గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. రేపిస్టులకు బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలని.. ఇందుకోసం IPC, CRPC చట్టాల్లో తగిన సవరణలు చేయాలని మంత్రి కేటీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు.

2002లో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు.. బాధితురాలి కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఈకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులందరిని గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సోమవారం విడుదల చేశారు. అయితే రేప్ కేసులో రెవిషన్ ప్రకారం దోషులను విడుదల చేయడాన్ని గుజరాత్ ప్రభుత్వం సమర్థించుకుంది. 1992 నాటి రెమిషన్ విధానం ప్రకారమే ఖైదీలను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

బాసర IIITలో మరో విద్యార్థి‌ సూసైడ్‌.. అసలేం జరుగుతోందక్కడ?
బాసర IIITలో మరో విద్యార్థి‌ సూసైడ్‌.. అసలేం జరుగుతోందక్కడ?
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నారు.. కట్ చేస్తే.. ఎంక్వయిరీతో.!
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నారు.. కట్ చేస్తే.. ఎంక్వయిరీతో.!
హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా
హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా
పాపం ఇరుకున్న స్వప్న.. వెన్నెల కోసం టెన్షన్‌గా ఎదురు చూపులు..
పాపం ఇరుకున్న స్వప్న.. వెన్నెల కోసం టెన్షన్‌గా ఎదురు చూపులు..
తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.?
తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.?
కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో త్రిముఖ పోటీ
బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో త్రిముఖ పోటీ