Minister KTR: అడిగిన వెంటనే ల్యాప్ టాప్ పంపించిన మంత్రి కేటీఆర్..తాను ఊహించలేదంటూ ఉబ్బితబ్బి బైన విద్యార్థి..

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ట్విట్టర్ వేదికగా #Ask KTR కార్యక్రమంతో నెటిజన్లను ఆకట్టుకున్నారు. శుక్రవారం రెండుగంటల పాటు ఈకార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు అడిగిన ప్రశ్నలకు

Minister KTR: అడిగిన వెంటనే ల్యాప్ టాప్ పంపించిన మంత్రి కేటీఆర్..తాను ఊహించలేదంటూ ఉబ్బితబ్బి బైన విద్యార్థి..
Ktr
Follow us

|

Updated on: Aug 06, 2022 | 5:34 PM

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ట్విట్టర్ వేదికగా #Ask KTR కార్యక్రమంతో నెటిజన్లను ఆకట్టుకున్నారు. శుక్రవారం రెండుగంటల పాటు ఈకార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అంతేకాదు ఓ విద్యార్థి అడిగిన వెంటనే ల్యాప్ టాప్ పంపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన లోకేష్ జాతోతు తాను ఇంజినీరింగ్ చదువుతున్నానని.. ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలోనే చదుకున్నానని.. తన తల్లిదండ్రులు పేదవారు కావడంతో ల్యాప్ టాప్ కొనుగోలు చేయలేపోయానని..#Ask KTRలో ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన మంత్రి గంటల వ్యవధిలోనే ఆవిద్యార్థికి ల్యాప్టాప్ ను పంపిచారు. దీంతో ఆబహుమతి తీసుకున్న లోకేశ్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇంత త్వరగా స్పందన వస్తుందని ఊహించనే లేదంటూ ఓ వీడియోను పోస్టు చేశాడు. ఇప్పటివరకు ఎంతో మందిని ల్యాప్ టాప్ కావాలంటూ అడిగానని ఎవరూ సరిగ్గా స్పందిచలేదని లోకేశ్ చెబుతూ..లాను ల్యాప్ టాప్ స్వీకరించానని ఎంతో సంతోషంగా ఉందని.. ఇది నాజీవనశైలిలో ఎంతో మార్పు తీసుకొస్తుందంటూ వీడియోలో పేర్కొన్నాడు. మంత్రి కేటీఆర్ మరిన్ని పెద్ద బాధ్యతలు చేపట్టాలంటూ ఆకాంక్షించాడు. దీనికి స్పందించిన మంత్రి నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుని..మరింత మందికి సహాయపడుతూ అందరూ గర్వించేలా ఎదగాలంటూ ఆవిద్యార్థికి సూచించాడు.

మరోవైపు #Ask KTR కార్యక్రమానికి రెండు గంటల వ్యవధిలో దాదాపు 22వేల800 మంది ట్వీట్లు చేయగా.. చాలా ట్వీట్లకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. అయితే స్పౌస్ ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తున్న భార్య, భర్తలను ఒకే జిల్లాలో నియమించేలా చర్యలు తీసుకోవాలని..ఈఅంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని అమలుచేయాలంటూ చాలా మంది ట్వీట్లు చేయగా..దీనికి మాత్రం కేటీఆర్ స్పందిచలేదు. మరికొన్ని సమస్యలను ప్రజలు కేటీఆర్ దృష్టికి తీసుకురాగా..వాటిపై సంబంధిత మంత్రులు, అధికారులను కలవాలని సమాధానమిచ్చాడు. శ్రీకాళహస్తికి చెందిన ఓ యువకుడు వచ్చే ఎన్నికల్లో మీరు ఆంధ్రాలో పోటీచేయాలని అడగ్గా.. ఆహ్వానానికి ధన్యవాదాలంటూ రీట్వీట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి