గద్వాల తల్లీబిడ్డ కన్నుమూసిన ఘటనపై హైకోర్టు సీరియస్

గద్వాల తల్లీబిడ్డ కన్నుమూసిన ఘటనపై హైకోర్టు సీరియస్

క‌రోనా దేశానికి విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని తెచ్చింది. దీనివల్ల ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ జోగులంబ గద్వాల జిల్లా విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వైద్య అందక గర్భిణి… ఆ తర్వాత పుట్టిన బిడ్డ మృతి చెందారు. ఈ ఘటనతో క‌ల‌త చెందిన ఓ లాయర్ హైకోర్టుకు లేఖ రాశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. అన్ని ఆస్పత్రుల్లో నాన్ క‌రోనా కేసుల కోసం అంబులెన్స్ లను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించింది. మరోసారి […]

Ram Naramaneni

|

May 04, 2020 | 5:13 PM

క‌రోనా దేశానికి విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని తెచ్చింది. దీనివల్ల ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ జోగులంబ గద్వాల జిల్లా విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వైద్య అందక గర్భిణి… ఆ తర్వాత పుట్టిన బిడ్డ మృతి చెందారు. ఈ ఘటనతో క‌ల‌త చెందిన ఓ లాయర్ హైకోర్టుకు లేఖ రాశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. అన్ని ఆస్పత్రుల్లో నాన్ క‌రోనా కేసుల కోసం అంబులెన్స్ లను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించింది. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడ‌ద‌ని సూచించింది.

వివరాల్లోకి వెళ్తే.. గద్వాలకు చెందిన ఓ నిండు గర్భిణి… పురిటి నొప్పులతో గద్వాల హాస్పిట‌ల్ కి వెళ్లింది. అక్కడ ఆమెకు ట్రీట్మెంట్ చేసేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో అక్కడ్నుంచి మహబూబ్ నగర్ ఆస్పత్రికి ఆమె తరలించారు. అక్కడ కూడా పాపం ఆ పేద మ‌హిళ పురిటి నొప్పుల‌కు స‌మాధానం దొర‌క‌లేదు. అక్క‌డ్నుంచి హైద‌రాబాద్ తీసుకెళ్ల‌మ‌న్నారు. తీరా అక్క‌డ‌కు వెళ్లాక‌ నిండు చూలాలకు ఆస్పత్రిలో చేర్పించుకునేందుకు రూల్స్ పెట్టారు. గాంధీ ఆస్పత్రికి వెళ్లి గ‌ర్భిణికి కరోనా లేదని రిపోర్ట్ తీసుకురావాలన్నారు. ఇలా పురిటి నొప్పులతో పాపం ఆ మ‌హిళ‌ దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆ తర్వాత ఓ ఆస్పత్రిలో డెలివరీ అయిన‌ అనంత‌రం.. త‌ల్లీ బిడ్డ ఇద్ద‌రూ క‌న్నుమూశారు.

ఈ విషాద‌ ఘటనపై గద్వాల జిల్లాకు చెందిన లాయ‌ర్ కిషోర్ కుమార్ హైకోర్టుకు లేఖ రాశారు. లాక్ డౌన్ రూల్స్ తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్ర‌సవం చెయ్య‌డం కోసం 6 ఆస్ప‌త్రులు తిప్పార‌ని ఆరోపించారు. లాయర్ రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు సీరియస్ అయ్యింది. లేఖలోని అంశాలపై ఎంక్వైరీ చేప‌డుతూ తెలంగాణలోని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని హాస్పిట‌ల్స్ లో డెలివరీ, ఇతర ఎమర్జెన్సీ కేసులకు ట్రీట్మెంట్ అందించాలని ఆదేశించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu