అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే మూడు రోజులు..

తెలంగాణ ప్రాంతంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో..

అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే మూడు రోజులు..
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2020 | 4:39 PM

తెలంగాణ ప్రాంతంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతేకాదు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

కాగా, మంగళవారం హైదరాబాద్‌ నగర శివారులోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ముఖ్యంగా ఈసీఐఎల్, కుషాయిగూడ, జవహర్‌ నగర్‌ మున్సిపల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.