Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. 10వేల సూపర్ స్పెషాలిటీ పడకల ఏర్పాటు దిశగా అడుగులు..

రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్ద పీట వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగానే రాష్ట్రంలో పలు చోట్ల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది. సామాన్యులకు కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా...

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. 10వేల సూపర్ స్పెషాలిటీ పడకల ఏర్పాటు దిశగా అడుగులు..
super speciality hospitals
Follow us

|

Updated on: Nov 16, 2022 | 7:05 PM

రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్ద పీట వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగానే రాష్ట్రంలో పలు చోట్ల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది. సామాన్యులకు కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా 2000 పడకల నిమ్స్‌ విస్తరణ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు ఇచ్చారు.

ఈ విషయమై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు ట్వీట్ చేశారు. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా మరో పెద్ద అడుగుపడిందని తెలిపిన హరీష్‌ రావు.. నిమ్స్‌ విస్తరణ కోసం ప్రభుత్వం రూ. 1,571 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నిమ్స్‌లో ఇప్పటికే 1800 పడకలు అందుబాటులో ఉండగా. హైదరాబాద్‌ నగరానికి నాలుగు వైపులా నాలుగు టిమ్స్‌లను ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. వీటితో పాటు వరంగల్‌లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో మొత్తం తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ పడకలు 10,000కి చేరువకానున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక నిమ్స్‌ విస్తరణలో భాగంగా ప్రభుత్వం రూ. 1571 కోట్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా 2000 పడకల నిర్మాణం చేపట్టనున్నారు. వీటిలో 500 ఐసీయూ బెడ్స్‌, 42 విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు సూపర్‌ స్పెషాలిటీ నర్సింగ్ అందుబాటులోకి రానుంది. దీనికి అనుబంధంగా హెల్త్‌ సైన్సెస్‌ ట్రైనింగ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..