Azadi Ka Amrit Mahotsav: విద్యార్థులకు గుడ్‏న్యూస్.. ఆగస్ట్ 9 నుంచి స్కూల్ పిల్లల కోసం ప్రత్యేక సినిమా.. ఫ్రీగా చూడొచ్చు..

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఆగస్ట్ 9 నుంచి 21 వరకు రాష్ట్రంలోని 562 సినిమా హాళ్లలో ఉదయం పూట పాఠశాల విద్యార్థుల కోసం

Azadi Ka Amrit Mahotsav: విద్యార్థులకు గుడ్‏న్యూస్.. ఆగస్ట్ 9 నుంచి స్కూల్ పిల్లల కోసం ప్రత్యేక సినిమా.. ఫ్రీగా చూడొచ్చు..
Telangana
Follow us

|

Updated on: Aug 08, 2022 | 9:41 PM

భారత దేశానికి సాత్వంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్ఐసీసీలో ప్రారంభించారు. ఈ వేడుకలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 రోజులపాటు అన్ని జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్‏తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ వజ్రోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‏ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఆగస్ట్ 9 నుంచి 21 వరకు రాష్ట్రంలోని 562 సినిమా హాళ్లలో ఉదయం పూట పాఠశాల విద్యార్థుల కోసం దివంగత డైరెక్టర్ రిచర్డ్ అటెన్ బరో తెరకెక్కించిన గాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 22 లక్షల మంది స్కూల్ స్టూడెంట్స్‏కు గాంధీ చిత్రాన్ని ఉచితంగా వీక్షించనున్నారు. స్వాతంత్ర పోరాటంపై అవగాహన కల్పించేందుకు ఈ స్క్రీనింగ్ దోహదపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

లక్షలాది మంది విద్యార్థులు గాంధీ చిత్రాన్ని చూసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‏లను ఆదేశించారు.