LRS Scheme: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకూ రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఆదేశం..

ఎల్ఆర్ఎస్ అంశంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గింది.

LRS Scheme: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకూ రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఆదేశం..
Follow us

|

Updated on: Dec 29, 2020 | 5:42 PM

LRS Scheme: ఎల్ఆర్ఎస్ అంశంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గింది. ఎల్ఎస్ఆర్ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించింది. అయితే కొత్తగా వేసిన లేఅవుట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరిట ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఇంతకుముందే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఎల్ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా, ఎల్ఆర్ఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఎల్ఆర్ఎస్ స్కీమ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గకుంటే ధర్నాకు సైతం వెనుకాడబోమంటూ హెచ్చరికలు జారీచేశారు. ప్రజలు అయితే ఈ స్కీమ్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వంపై ఉన్న ఆ ఆగ్రహమే ఇటీవల జరిగిన వరుస ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని ఎన్నికల నిపుణులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా వరుస విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే నేడు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గినట్లు అంతా భావిస్తున్నారు.

Also read:

New Coronavirus Strain in AP : ఏపీలో తొలి స్ట్రెయిన్ వైరస్ కేసు నమోదు..రాజమండ్రి వచ్చిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ

Cp waring to drunk and drivers: తాగి వాహనం నడుపుతున్నారా.? అయితే మీరు తీవ్రవాదే.. ఈ మాట అంటోంది ఎవరో కాదు.