Telangana: లగచర్ల ఫార్మాసిటీ భూసేకరణపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!

ఫార్మా విలేజ్‌ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ కోసం వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో నిర్వహించిన గ్రామసభ రణరంగాన్ని తలపించింది.

Telangana: లగచర్ల ఫార్మాసిటీ భూసేకరణపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!
Lagacharla Land Acquisition Notification
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 29, 2024 | 3:33 PM

ఫార్మా విలేజ్‌ కోసం భూములు ఇచ్చేదే లేదని లగచర్ల రైతులు తేల్చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్‌ ఏర్పాటు కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఫార్మా విలేజ్‌ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ కోసం వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో నిర్వహించిన గ్రామసభ రణరంగాన్ని తలపించింది. కొడంగల్‌ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. భూసేకరణకు వ్యతిరేకంగా స్థానిక రైతులు గత కొంతకాలంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ప్రజాభిప్రాయసేకరణ కోసం గ్రామసభ నిర్వహించగా.. అక్కడ జరిగిన దాడిలో అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

అయితే గిరిజనుల పోరాట ఫలితంగానే ప్రభుత్వం లగచర్ల నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలోనూ.. ఈ‌ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. అన్ని వర్గాల తరపున బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. ఇదిలావుంటే, మరి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం మరో నోటిఫికేషన్ జారీ చేస్తే రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతారా.. లేదా మళ్లీ పోరుబాట పడుతారా అన్నది చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు వెనుక సర్కార్‌ ప్లానేంటి..?
భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు వెనుక సర్కార్‌ ప్లానేంటి..?
మార్పు మంచిదేనా.? పదోతరగతి పరీక్ష విధానం మార్పుపై ఏమంటున్నారు..
మార్పు మంచిదేనా.? పదోతరగతి పరీక్ష విధానం మార్పుపై ఏమంటున్నారు..
20 ఏళ్ల నాటి ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్..గుర్తు పట్టారా?
20 ఏళ్ల నాటి ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్..గుర్తు పట్టారా?
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
మహేష్ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన మెగా హీరో..
మహేష్ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన మెగా హీరో..
కన్ను బాగు చేస్తారనుకుంటే ప్రాణం తీసేశారు.! ఏం డాక్టర్ రా బాబు..
కన్ను బాగు చేస్తారనుకుంటే ప్రాణం తీసేశారు.! ఏం డాక్టర్ రా బాబు..
మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా.? గుండెపోటు వస్తుంది జాగ్రత్త..
మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా.? గుండెపోటు వస్తుంది జాగ్రత్త..
18 ఏళ్ల వయసులోనే వేధింపులు.. హీరోయిన్..
18 ఏళ్ల వయసులోనే వేధింపులు.. హీరోయిన్..