ఈ ఏడాది పంద్రాగస్టు జెండావిష్కరణ ఎక్కడ..?

ఈ ఏడాది పంద్రాగస్టు జెండావిష్కరణ ఎక్కడ..?

ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై కరోనా ప్రభావం పడుతోంది. పంద్రాగస్టు వేడుకలు ఈ సారి ప్రగతి భవన్‌లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రగతి భవన్‌లోనే నిర్వహించవచ్చని తెలిస్తోంది. సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లోనే పతాకావిష్కరణ చేయనున్నట్లు సమాచారం.

Balaraju Goud

|

Aug 13, 2020 | 2:51 PM

ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై కరోనా ప్రభావం పడుతోంది. పంద్రాగస్టు వేడుకలు ఈ సారి ప్రగతి భవన్‌లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రగతి భవన్‌లోనే నిర్వహించవచ్చని తెలిస్తోంది. సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లోనే పతాకావిష్కరణ చేయనున్నట్లు సమాచారం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ 15న ఉదయం 10.30 గంటలకు జెండాను ఆవిష్కరిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే జెండావిష్కరణ ఎక్కడన్నదీ స్పష్టం చేయలేదు. మిగతా 32 జిల్లా కేంద్రాల్లో జెండాలను ఎగురవేసే మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధుల వివరాలను వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులను జారీ చేశా రు. వేడుకల సందర్భంగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని, జెండావిష్కరణకు పరిమిత సంఖ్యలో హాజరు కావాలని సూచించారు.

గత ఏడాది గణతంత్ర ఉత్సవాలను సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండులో నిర్వహించారు. ఆ తర్వాత అన్ని ఉత్సవాలను నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు 2019లో జూన్‌ 2న రాష్ట్రావతరణ ఉత్సవాలు, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం పబ్లిక్‌ గార్డెన్‌లో జరిగాయి. అయితే, ఈ ఏడాది గణతంత్ర వేడుకలు కూడా అక్కడే జరిగాయి. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో జూన్‌ 2న రాష్ట్రావతరణ ఉత్సవాలు మాత్రం ప్రగతి భవన్‌లో నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ అక్కడే జెండాను ఆవిష్కరించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిమిత సంఖ్య జనం మధ్య జెండావిష్కర కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ నెల 15న స్వాతం త్య్ర దినోత్సవాన్ని కూడా ప్రగతి భవన్‌లోనే నిర్వహిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా తగ్గుముఖం పట్టకపోవడం, పంద్రాగస్టుకు పోలీసు పరేడ్‌ ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌లోనే స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తారని సమాచారం. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావల్సిఉంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu