Telangana Floods: వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీతక్క పర్యటన.. పడవ ప్రయాణంలో తృటిలో తప్పిన ముప్పు

వరద గుప్పిట్లో చిక్కుకున్న గ్రామాల్లోని బాధితులు  బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. దీంతో వరద బాధితులకు తాము అండగా ఉన్నామంటూ.. ప్రజా ప్రతినిధులు భరోసా ఇస్తున్నారు.

Telangana Floods: వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీతక్క పర్యటన.. పడవ ప్రయాణంలో తృటిలో తప్పిన ముప్పు
Mla Sitakka In Floods Area
Follow us

|

Updated on: Jul 16, 2022 | 5:22 PM

Telangana Floods: ఎగువ రాష్ట్రాలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కురిసిన భారీ వర్షాలకు గోదావరి(Godavari River) ఉగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి నది బీభత్సం సృష్టిస్తోంది. ప్రాజెక్టుల్లో వరద నీరు భారీగా చేరుకోవడంతో గోదావరి నది పరివాహక ప్రాంతాలు చిగురుటాకుల వణుకుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అనేక  గ్రామాలు వరద నీటితో నిండిపోయాయి. వరద బాధితుల సహాయం కోసం అధికారులు, ఆర్మీ ఎన్డీఆర్ ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. అనేక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వరద గుప్పిట్లో చిక్కుకున్న గ్రామాల్లోని బాధితులు  బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. దీంతో వరద బాధితులకు తాము అండగా ఉన్నామంటూ.. ప్రజా ప్రతినిధులు భరోసా ఇస్తున్నారు. బాధితగ్రామాల్లోని ప్రజల దగ్గరకు బోట్ల లో వెళ్లి  పరామర్శిస్తున్నారు. తాము అండగా ఉన్నామంటూ దైర్యం చెబుతున్నారు.

వరద ముంపు ప్రాంతంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. ముంపు ప్రాంతాల్లో నిత్య అవసర సరుకులు పంపిణీని ఎమ్మెల్యే సీతక్క చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాగులో పడవ పై ప్రయాణిస్తున్న సమయంలో పడవలో పెట్రోల్ అయిపొయింది. దీంతో ఆ పడవ ఓ చెట్టుకు ఢీ కొని ఆగిపోయింది.  ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపెల్లిలో వరద ప్రాంతంలో చోటు చేసుకుంది.

పడవలో పెట్రోల్ అయిపోవడంతో.. వాగు ఉద్ధృతికి పడవ కొట్టుకొనివచ్చి ఒడ్డుకు వచ్చి ఆగిపోయింది. దీంతో సీతక్క అక్కడ ఉన్న చెట్టును ఆసరా చేసుకుని.. ఒడ్డుకు చేరుకున్నారు సీతక్క.. దీంతో సహచరులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!