Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీ ఎప్పుడంటే..

తెలంగాణలో ఇప్పటికే కొలువుల జాతర నుడస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న వేళ.. తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీ ఎప్పుడంటే..
Minister Harish Rao
Follow us

|

Updated on: Sep 15, 2022 | 12:15 PM

Telangana: తెలంగాణలో ఇప్పటికే కొలువుల జాతర నుడస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న వేళ.. తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలపై ప్రత్యేక దృష్టిసారించామన్న ఆయన.. గురుకులాల్లో కాంట్రాక్ట్ పోస్టులను త్వరలో రెగ్యులర్ చేస్తామన్నారు. అలాగే గురుకుల పాఠశాలల్లో ఒక్క పోస్ట్ ఖాళీ లేకుండా అన్నింటిని త్వరలోనే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. నార్సింగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అధికారులతో కలిసి తరగతులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఖర్చు చేసే నిధులను కాపిటల్, రెవెన్యూ ఎక్స్ పెండేచర్ గా చూస్తారని… తెలంగాణలో పిల్లలపై భవిష్యత్ కోసం చేసే ఖర్చును సీఏం కేసీఆర్ మూలధన వ్యయంగా చూస్తున్నారని తెలిపారు. తెలంగాణలోని అన్ని గురుకుల పాఠశాలలను కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశారని, దేశంలోనే తొలిసారి మహబూబ్ నగర్, సంగారెడ్డి లో గురుకుల లా కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు.

గురుకుల పాఠశాలలపై తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ. 3,300 కోట్లు ఖర్చు చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. భావి తరాల బాగు కోసం విద్యపై పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సమీపంలోని గురుకుల పాఠశాలలను సందర్శించాలని, పిల్లల ఆరోగ్య పరిస్థితి నెలవారీగా సమీక్షించాలని సూచించారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు తల్లిదండ్రులకు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు.

1నుండి 19 ఏళ్ల లోపు పిల్లలపై నులిపురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయని, తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయి రోగాల బారిన పడుతారని మంత్రి తెలిపారు. ఆకలి మందగించి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని, అలాంటి సమయంలో శస్త్ర చికిత్స చేసి వీటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అపరిశుభ్రత వల్లే నులిపురుగులు పిల్లలకు సంక్రమిస్తాయని, చేతిగోర్లను శుభ్రంగా ఉంచుకోకపోవడం, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, కలుషిత ఆహారం వల్ల ఇవి సంక్రమిస్తాయని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల కూడా నులిపురుగులు శరీరంలోకి ప్రవేశించి హాని చేస్తాయని మంత్రి చెప్పారు. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!
ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!
ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..
ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??