Bjp vs Trs: అమిత్ షా వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు.. లెక్కలతో సహా వివరిస్తూ..

Bjp vs Trs: అమిత్ షా వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు.. లెక్కలతో సహా వివరిస్తూ..
Harish Rao

Bjp vs Trs: బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అమిత్ షా కాదు.. అబద్ధాలకు బాద్ షా..

Shiva Prajapati

|

May 15, 2022 | 6:27 PM

Bjp vs Trs: బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అమిత్ షా కాదు.. అబద్ధాలకు బాద్ షా.. అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు ఇక్క డ మీడియాతో మాట్లాడిన ఆయన.. తుక్కుగూడలో అమిత్ షా ప్రసంగంపై తీవ్రంగా స్పందించారు. అమిత్ షా చాలా అలవోకగా అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. అమిత్ షా అలవోకగా అబద్ధాలు మాట్లాడారని, పచ్చి జూటా మాటలు చెప్పి వెళ్లారని ద్వజమెత్తారు. ‘‘ఇది మీ గుజరాత్ కాదు. అమాయకులైన తెలంగాణ కానేకాదు. ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ గడ్డ. ఇక్కడ నీ అబద్ధాలు నడవవు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు.’’ అంటూ అమిత్ షాకు వరుస ప్రశ్నలు సంధించారు మంత్రి హరీష్ రావు.

1, ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు ఇవ్వలేదు అన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు టీఆరెఎస్ మద్దతు తెలిపింది. ఇది వాస్తవం. మా ఎంపీలు ఓటు కూడా వేశారు. 2. మిషన్ భగీరథ కు కేంద్రం రూ. 25,000 కోట్లు ఇచ్చింది అన్నారు. నిజం చెప్పండి. వాస్తవాలు మాట్లాడండి. 2 రూపాయలు అయినా ఇచ్చారా. ఆధారం చూపండి. సొంత ఖర్చులతో పథకం అమలు చేస్తున్నాం. మంచి ఫలితాలు ఇచ్చిందని కేంద్రం కూడా చెప్పింది. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్రం చెప్పింది. 3. ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదు అన్నారు. ఇది అబద్దం. 18, మే 2021 నుండి రాష్ట్రంలో అమలు చేస్తున్నం. పార్లమెంట్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి అమలు చేస్తున్నారు అని స్పష్టం చేశారు. ఇలా ఒకరేమో అమలు అవుతుంది అంటారు.. మరొకరు కాదు అంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు. ఇప్పటి వరకు ఈ పథకం(ఆయుష్మాన్ భారత్) కింద 3.62 వేల మందికి చికిత్స చేయడం జరిగింది. ఇందుకోసం రూ. 850 కోట్లు ఖర్చు కాగా.. కేంద్రం రూ.150 కోట్లు మాత్రమే ఇచ్చింది. తెలంగాణ 700 కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకం కింద కేంద్రం 26 లక్షల మందికి ఇస్తే మేము 87. 60 లక్షల మందికి ఇస్తున్నాం. అయినప్పటికీ ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణలో అమలు కాలేదని అంటున్నారు. ఒకవేళ మీరు అన్నట్లు పథకం అమలు కాకపోతే.. రూ. 150 కోట్లు ఎందుకిచ్చారు. 4. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయలేదు అన్నారు. 3 సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులకు రూ. 2,679 కోట్లకు శంకుస్థాపన చేశారు. లోకల్ బిజెపి నాయకులు చెప్పరా.. తెలియదా ఈ విషయం. నీతి అయోగ్ సూచిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. డబుల్ డెక్కర్ ఉన్న యూపీ లాస్ట్. నిజాలపై చర్చకు సిద్దంగా ఉన్నారా?. 5. మన ఊరు మన బడి పైసలు మాయే అన్నరు. రూ.7,300 ఖర్చు చేస్తున్నాం. సర్వ శిక్ష అభియాన్‌లో వచ్చేది రూ.300 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,000 కోట్లు సమకుర్చితున్నది. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం తెస్తున్నది. అది తెలుసా మీకు. మొత్తం మేమే ఇస్తున్నాం అంటున్నారు. 6. ఇద్దరు కేంద్ర మంత్రులు వేర్వేరు మాటలు చెప్పారు. కిషన్ రెడ్డి నారెగా కు రూ.30 వేల కోట్లు ఇచ్చాము అంటారు. అమిత్ షా రూ.18 వేల కోట్లు అంటారు. ఒక్కొక్కరిది ఒక్కో మాట. జుటా మాటలు తప్ప ఏం లేదు. నడి రోడ్డు మీద అబద్ధాలు చెప్పారు. తెలంగాణలో ఓట్లు కావాలని.. అమిత్ షా అబద్ధాల పురాణాలు చదివారు.

నీళ్ళు, నిధులు, నియామకాల గురించి మాట్లాడే నైతికత బీజేపీకి లేదు. తెలంగాణపై అంత ప్రేమ ఉంటే.. ఎందుకు తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అప్పర్ భద్ర, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు. మరి తెలంగాణకు ఏం ఇచ్చారు? అని ప్రశ్నించారు. కృష్ణ జలాల్లో తెలంగాణ వాట తేల్చాలి అంటే ట్రిబ్యునల్ కు రిఫర్ చేయరని మండిపడ్డారు. ఇక వడ్ల విషయంపై మాట్లాడటం మరింత హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘నీళ్ల విషయంలో ఎక్కడి వెళ్దామో చెప్పాలి.. ఎక్కడికి వచ్చినా చూపిస్తా. పండిన పంటే సాక్ష్యం. దేశంలో అతి ఎక్కువ వరి పండించిన రాష్ట్రం తెలంగాణ. ఇదే సాక్ష్యం. ఇది మీకు కనిపించడం లేదా?’’ అని మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు.

బీజేపీ అధికారంలోకి రావడం కోసం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నారు.. మరి ఆ హామీ ఏమైందో చెప్పాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15.62 లక్షల ఉద్యోగాలు నింపకుండా నిలిపివేశారని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ నిలిపివేసి.. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ అమ్మేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘నిరుద్యోగం మీద బీజేపీ నేతలు పెద్ద మాటలు మాట్లాడుతున్నరు. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో మేము ఇప్పటి వరకు లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశాము. ఇప్పుడు మరో 91 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. మరి మీ సంగతి ఏంటి?.’’ అని బీజేపీ నేతలను నిలదీశారు మంత్రి హరీష్ రావు. బీజేపీ అధికారంలోకి రాకముందు నిరుద్యోగ రేటు 4.7 శాతం ఉంటే.. ఇప్పుడు 7.11 శాతానికి పెరిగిందన్నారు. దేశంలో 15,62,962 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, ఆర్మీలో 2 లక్షలు, రైల్వైలో 3 లక్షలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41 వేల పోస్టులు ఇలా అనేక విభాగాల్లో సుమారు 25శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో పెద్ద పెద్ద హామీలు ఇచ్చారని, ఈ లెక్కన ఇప్పటి వరకు 15 కోట్ల ఉద్యోగాలు రావాలని పేర్కొన్నారు. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రకటిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

‘‘రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం లేకుండా నింపుతామన్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఇప్పటికే నోటిఫికేషన్లు కనబడటం లేదా? ఉన్న ఖాళీలను నింపుతున్నాం. 95 శాతం స్థానికులకు దక్కేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ ఉద్యోగాలు నింపుతారు. 15.60 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు నింపుతారో ముందు చెప్పు?’’ అని బీజేపీ నేతలను మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు శ్రద్ధాంజలి ఘటించిన బీజేపీ నేతలు.. తెలంగాణ అమరవీరులకు ఎందుకు శ్రద్ధాంజలి ఘటించలేదని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. జై భారత్ అని అందరం అంటామని, జై తెలంగాణ అనడానికి నోరు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఎందరో అమరుల త్యాగ ఫలం.. అలాంటి అమరులకు విలువ ఇవ్వకుండా కేవలం కాంగ్రెస్ వాళ్లకు శ్రద్ధాంజలి ఘటించారని విమర్శించారు. బయ్యారం రైల్వే, ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రిగా విభజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఫసల్ బీమా యోజన లేదని అంటున్నారని, గుజరాత్‌లోనే అమలు చేయడం లేదని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. కార్పొరేట్ కొమ్ముకాసే యోజన అని మీ గుజరాత్ ప్రభుత్వమే అమలు చేయడం లేదని బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు.

రైతు వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ మంత్రి హరీష్ రావు. రూ. 2,500 కోట్లు లంచం ఇస్తే సీఎం అవుతారని కర్ణాటక ఎమ్మెల్యే చేసిన కామెంట్స్.. బీజేపీ విధానాలకు నిదర్శనం అని తూర్పారబట్టారు మంత్రి హరీష్ రావు. బీజేపీ నేతలు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని లెక్కలతో సహా, ఆధారాలతో సహా బట్టబయలు చేశామని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu