Telangana Schools: తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభంపై DH కీలక కామెంట్స్.. ఆల్ సెట్

Telangana Schools: తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభంపై DH కీలక కామెంట్స్.. ఆల్ సెట్
Telangana Schools

తెలంగాణలో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బడులు తెరిచేందుకు తాము నివేదిక ఇచ్చినట్లు ప్రజారోగ్య శాఖ..

Ram Naramaneni

|

Aug 18, 2021 | 5:52 PM

తెలంగాణలో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బడులు తెరిచేందుకు తాము నివేదిక ఇచ్చినట్లు ప్రజారోగ్య శాఖ సంచాలకులు  శ్రీనివాసరావు చెప్పారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న టీచర్లను, స్టాఫ్‌నే స్కూళ్లలోకి అనుమతించే అవకాశం ఉందన్నారు. త్వరలో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. టీకా తీసుకోని వారిని పబ్లిక్‌ ప్లేసుల్లోకి అనుమతించకుండా నిబంధనలు మార్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు రాష్ట్రంలో సెకండ్​వేవ్​ ముగిసిపోయిందని డీహెచ్​ శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో ఆర్ ఫ్యాక్టర్ 0.7 % మాత్రమే ఉందని…. పోస్ట్​ కోవిడ్​తో ఆస్పత్రిలో చేరిన వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. దీర్ఘకాల కొవిడ్​ ఎఫెక్ట్​ కారణంగా కారణంగా మనసిక సమస్యలు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.65 కోట్ల మందికి వ్యాక్సినేషన్​ పూర్తైందని… సుమారు 56% మందికి ఫస్ట్ డోస్, 34% మందికి సెకండ్ డోస్ ఇచ్చామన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 100 శాతం మందికి కనీసం ఒక డోస్ పూర్తికాగా… జీహెచ్‌ఎంసీలో 90శాతం మందికి కనీసం ఒక డోస్ పూర్తయిందని తెలిపారు.

సీజనల్ వ్యాధులతో తస్మాత్ జాగ్రత్త 

సీజనల్​ వ్యాధుల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని డీహెచ్‌ శ్రీనివాసరావు సూచించారు. అన్ని జ్వరాలు కరోనా​ జ్వరాలు కాదని.. రాష్ట్రంలో కొవిడ్​ చాలా వరకు అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు నమోదవుతున్నాయని.. హైదరాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు బయటపడ్డాయని డీహెచ్​ తెలిపారు. ఇప్పటివరకు 1200 డెంగ్యూ కేసులు వచ్చాయని… మొత్తంగా 13 జిల్లాల్లో మలేరియా, డెంగీ జ్వరాల కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఎవరికైనా జ్వరం వస్తే ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ముందుగా టెస్టులు చేయించుకోవాలని డీహెచ్​ సూచించారు. పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా.. లార్వా పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ దోమ పగటి వేళ కుడుతుందని.. ఇళ్లలో దోమలు రాకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో డ్రై డేని మరలా ఆచరణలో పెట్టాలన్నారు. సీజనల్​ వ్యాధుల నివారణకు అధికార యంత్రాంగం పటిష్ఠ చర్యలు తీసుకున్నామని డీహెచ్​ శ్రీనివాసరావు తెలిపారు. దోమలు, లార్వా వృద్ధి నివారణ చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్లు నడుస్తున్నాయని ప్రజలందరు అలెర్ట్‌గా ఉండాలని సూచించారు.

Also Read: ఆంధ్రాలో కొత్తగా 1,433 కరోనా కేసులు.. ఆ రెండు జిల్లాల్లో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి

 కడుపున పుట్టినవాళ్లే ఆస్తి కోసం వేధించారు.. కన్నీళ్లతో బ్రతకలేక.. తనువు చాలించారు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu