అరుదైన ఘనత సాధించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి.. దేశంలోనే టాప్‌ ప్లేస్‌..

అరుదైన ఘనత సాధించారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. దేశంలోనే టాప్‌ 4వ ప్లేస్‌‌లో నిలిచారు. దేశంలోని టాప్ 25వ ఐపీఎస్‌ అధికారుల జాబితాలో తెలంగాణ డీజీపీ ఎమ్ మహేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా, ఆసియా పోస్ట్, పిఎస్‌యు వాచ్ అనే మూడు సంస్థలు..

  • Tv9 Telugu
  • Publish Date - 10:41 pm, Tue, 7 April 20
అరుదైన ఘనత సాధించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి.. దేశంలోనే టాప్‌ ప్లేస్‌..

అరుదైన ఘనత సాధించారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. దేశంలోనే టాప్‌ 4వ ప్లేస్‌‌లో నిలిచారు. దేశంలోని టాప్ 25వ ఐపీఎస్‌ అధికారుల జాబితాలో తెలంగాణ డీజీపీ ఎమ్ మహేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా, ఆసియా పోస్ట్, పిఎస్‌యు వాచ్ అనే మూడు సంస్థలు దేశ వ్యాప్త సర్వేలో పాల్గోని దేశంలోని పోలీస్ అధికారుల లిస్టును తయారు చేయగా.. అందులో డీజీపీ ఎమ్ మహేందర్ రెడ్డి 4వ స్థానంలో నిలిచారు. పోలీసు సేవలో పనితీరు ద్వారా కొత్త తరానికి బెంచ్ మార్క్ సృష్టించిన టాప్ 25 ఐపిఎస్ అధికారులను పీఎస్‌యూ వాచ్ సంస్థ గుర్తించింది.

దాదాపు 4 వేలమంది అధికారుల జాబితాలో టాప్ 25 ఐపిఎస్ అధికారులను జరిగినట్టు ప్యానెల్ పేర్కొంది. పోలీసు అధికారుల అంతర్గత నివేదికలు, మీడియా నివేదికలు, నిర్ధిష్ట జిల్లాల్లో మొదటి పోస్టింగ్ ప్రస్తుత హోదా వరకు కొలమానంగా ఈ సర్వే జరిగింది. కాగా ఈ సందర్భంగా పీఎస్‌యు వాచ్ మేనేజింగ్ ఎడిటర్ వివేక్ శుక్లా మాట్లాడుతూ.. ఓ ఐపీఎస్ అధికారి కేవలం శాంతిభద్రతల నిర్వహణ మాత్రమే కాకుండా.. నక్సలిజం, ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలు, మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అనేక విచిత్రమైన సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

హెడ్ కానిస్టేబుల్‌కు క్లాస్ పీకిన వైసీపీ ఎమ్మెల్యే

రెహమాన్‌కు బ్రేక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మృతి

‘పాలు’ తాగాడని కన్న కొడుకును చంపి, ఆత్మహత్య చేసుకున్న తండ్రి

కరోనా ‘మెడికల్ జ్యువెలరీ’.. వైరస్‌తో వ్యాపారమంటూ..

మరో వారంలో 15 అంతస్తుల కరోనా ఆస్పత్రి సిద్ధం..

చేతల్లోకి దిగండంటూ.. సీఎంపై గౌతమ్ గంభీర్ ఫైర్