Congress – Telangana: ఆ ఎమ్మెల్యే పార్టీ లో ఉన్నాడా లేడా?.. కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ.. ఇంతకీ ఆయనెవరంటే..

Congress - Telangana: ఆ ఎమ్మెల్యే పార్టీ లో ఉన్నాడా లేడా?.. కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ.. ఇంతకీ ఆయనెవరంటే..
Congress Party

Congress - Telangana: కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువే అంటారు. ఆ ఎక్కువే ఆయన్ని పార్టీపై ధిక్కారస్వరాన్ని వినిపించేలా చేస్తోందా..?

Ashok Bheemanapalli - Input Team

| Edited By: Shiva Prajapati

Feb 11, 2022 | 3:24 PM

Congress – Telangana: కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువే అంటారు. ఆ ఎక్కువే ఆయన్ని పార్టీపై ధిక్కారస్వరాన్ని వినిపించేలా చేస్తోందా..? పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడేలా ఉసిగొల్పుతోందా..? మొన్నటి వరకు సొంతపార్టీపైనే ఫైర్‌ అవుతూ వచ్చిన ఆయన.. ఇప్పుడెక్కడ ఉన్నాడు. కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్న పార్టీ మెంబర్‌షిప్‌ ప్రొగ్రాంలో ఎందుకు కనిపించడం లేదు. ఇంతకు ఎవరా నేత? ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇంతకు కాంగ్రెస్‌లో ఉన్నట్టా.. లేనట్టా.. ఇప్పుడిదే చర్చ ఆయన సొంత పార్టీతో పాటు రాజకీయ వర్గా్ల్లోనూ జోరుగా సాగుతోంది.

కొద్దిరోజులుగా కనిపించని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి !? పార్టీ కార్యక్రమాలకు దూరం ఇంతకు ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నాడా! ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌గా చేపట్టిన మెంబర్‌షిప్‌ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎక్కడా కనిపించకపోవడం ఆసక్తి రేపుతోంది. ఒకానొక దశలో బీజేపీని పొడిగిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి .. ఆ పార్టీలో చేరుతారన్న ప్రచారం సాగింది. అంతేకాదు.. ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కమలం నుంచే పోటీ చేస్తారన్న చర్చ నడిచింది. కానీ ఆ తర్వాత ఎందుకో సైలెంట్‌ అయ్యారు. కొద్దిరోజులు మౌనం పాటించిన ఆయన.. కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని తీవ్రంగా తప్పుపడుతూ వచ్చారు. కొత్త కార్యవర్గాన్ని వ్యతిరేకిస్తూ.. పార్టీపై చిర్రుబుర్రులాడారు.

తెలంగాణ ఏర్పడ్డాక.. పార్టీ మనుగడే లేకుండా పోవడంతో అధిష్టానం నేతలకు సీరియస్‌గానే వార్నింగ్‌ ఇచ్చింది. దాంతో చాలా మంది పార్టీ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటూనే.. మెంబర్‌షిప్‌లను చేయిస్తున్నారు. పార్లమెంటు వైజ్‌గా చూస్తే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నెంబర్‌వన్‌లో ఉండగా.. అసెంబ్లీ వైజ్ గా ఇతర నాయకులు దూసుకుపోతున్నారు. మొదట్లో రేవంత్ ని వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడు మెంబర్షిప్ లో కూడా ముందున్నారు.

మొదట్లో మెంబర్ షిప్ విషయంలో కూడా సీనియర్ నాయకులు పట్టించుకోలేదు. కొంత కాలం తరువాత అధిష్టానం వార్నింగ్‌తో జగ్గారెడ్డి వంటివారితో పాటు అసమ్మతి వాదులంతా సెట్‌రైట్‌ అయ్యారు. అందులో కోమటిరెడ్డి కూడా మెంబెర్ షిప్ పై దృష్టి పెట్టారు. కానీ రాజగోపాల్‌రెడ్డి మాత్రం.. అటు పార్టీ కార్యక్రమాల్లో కానీ, మెంబర్‌షిప్‌ను చేయించడంలో కానీ కనిపించకపోవడం పార్టీలో పెద్ద చర్చకే దారితీస్తోంది. దీనికి సంబంధించి పీసీసీ సభ్యత్వ కార్యక్రమం అయ్యాక.. రాజగోపాల్‌రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.

Mla Rajagopal Reddy

Mla Rajagopal Reddy

Also read:

Andhra Pradesh Capita: పాఠ్య పుస్తకంలో ఏపీ రాజధాని మాయం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..!

Star Fruit Benefits: స్టార్ ఫ్రూట్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. దీనిని సూపర్ ఫుడ్ అంటున్న పోషకాహార నిపుణులు..

IPL 2022 Auction: మెగా వేలంలో ఈ ముగ్గురిపై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్.. వారెవరంటే?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu