Junior Doctors Strike: సంక్షోభం వేళ సమ్మె సరికాదు.. తక్షణమే విధుల్లో చేరాలని జూడాలకు సీఎం కేసీఆర్ సూచన..

Junior Doctors Strike: జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో వైద్యాధికారులతో..

Junior Doctors Strike: సంక్షోభం వేళ సమ్మె సరికాదు.. తక్షణమే విధుల్లో చేరాలని జూడాలకు సీఎం కేసీఆర్ సూచన..
KCR -
Follow us

|

Updated on: May 26, 2021 | 5:12 PM

Junior Doctors Strike: జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదన్నారు. ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వం ఏనాడూ వివక్ష చూపలేదని, వారి సమస్యలను పరిష్కరిస్తూనే వుందన్నారు. ఇప్పుడు కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఏవైనా సమస్యలుంటే.. ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలి కానీ.. చీటికి మాటికి ప్రజలకు ఇబ్బంది కలిగేలా చేయరాదన్నారు. సమయసందర్భాలను కూడా చూడకుండా సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరియైన పద్దతి కాదన్నారు. అదికూడా, కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని ప్రజలు హర్షించరని అన్నారు. ఇదిలాఉండగా.. జూనియర్ డాక్టర్ల సమస్యలు ఏంటనే దానిపై సీఎం ఆరా తీశారు. అధికారులు జూడాల సమస్యలను సీఎంకు వివరించగా.. వాటిని వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.

ఇకపోతే సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మూడు సంవత్సరాల వైద్య విద్య అభ్యసించి కోవిడ్ సేవల కొరకు కొనసాగుతున్న వైద్య విద్యార్దులకు కూడా సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనాన్ని అందించాలని సీఎం నిర్ణయించారు. కరోనా సేవలందిస్తున్న నేపథ్యంలో జూనియర్ డాక్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్ లో ఇప్పటికే అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నిబంధనల మేరకు ఎక్స్ గ్రేషియాను కూడా అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వారి కోరికమేరకు సత్వరమే ఆ ఎక్స్‌గ్రేషియాను అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి, సీఎంవో కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి, హెల్త్ సెక్రటరీ ఎస్ఎఎం రిజ్వీ, డిఎంఈ రమేశ్ రెడ్డి, డైరక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Also read:

Covid-19 Vaccination: దేశవ్యాప్తంగా వేగం పుంజుకున్న వ్యాక్సినేషన్.. 20 కోట్లకు చేరవగా టీకాల పంపిణీ

యంగ్ హీరో బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న చిత్రయూనిట్.. స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న 18 పేజెస్ టీమ్…

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..