Breaking: తెలంగాణ లాక్‌డౌన్ అప్‌డేట్.. ఎత్తేస్తారా.? నైట్ కర్ఫ్యూ విధిస్తారా.? రేపే అధికారిక ప్రకటన..

తెలంగాణలో ‌లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేయాలా.? లేదా నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించాలా.? అనే దానిపై శనివారం(రేపు) స్పష్టత రానుంది..

Breaking: తెలంగాణ లాక్‌డౌన్ అప్‌డేట్.. ఎత్తేస్తారా.? నైట్ కర్ఫ్యూ విధిస్తారా.? రేపే అధికారిక ప్రకటన..
Telangana Lockdown
Follow us

|

Updated on: Jun 18, 2021 | 8:55 PM

తెలంగాణలో ‌లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేయాలా.? లేదా నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించాలా.? అనే దానిపై శనివారం(రేపు) స్పష్టత రానుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ అత్యవసర భేటి కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తేయాలా.? నైట్ కర్ఫ్యూ విధించాలా.? అనే అంశంతో పాటు వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి తదితర అంశాలపై కేబినేట్ చర్చించనుంది. కాగా, లాక్‌డౌన్‌పై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

ఈనెల 20 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశం…

ఈనెల 20 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నైట్‌కర్ఫ్యూ మాత్రం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుతుండటంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు వీలుగా రోజంతా సాధారణ కార్యకలాపాలను అనుమతించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక వర్షాలు కూడా కురుస్తున్నందున వ్యవసాయ సీజన్‌ వేగం కూడా పుంజుకోవడంతో ఆంక్షల ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగానే తగ్గుముఖం పట్టాయి. పది వేలకుపైగా నమోదైన కేసులు.. ప్రస్తుతం 1000 నుంచి 1500 వరకు పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. రాష్ట్రంలో రివకరీ రేటు 96.13 శాతం ఉండగా, మరణాల రేటు 0.57 శాతం ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఆయా జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతుండగా, ప్రస్తుతం పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. అన్ని జిల్లాల కంటే జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదు అయ్యేవి. కానీ ఇప్పుడు ఈ సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇలా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 20 తర్వాత లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read:

వధువు పెళ్లి డ్రెస్‌లో దాక్కున్న వ్యక్తి.. ఏం చేశాడో తెలిస్తే నవ్వాపుకోలేరు.. ఫన్నీ వీడియో!

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఫ్యాన్స్‌కు పండగే

పెళ్ళి భోజనం లాగిస్తోన్న అమ్మాయి.. అంతలోనే బ్రేక్‌.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.!

సింహాల గుంపుతో గేదె పోరాటం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే.! వైరల్ వీడియో

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..