Crop War – Bjp vs Trs: వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి.. సీఎంకు బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్..

Bjp vs Trs: వరి సేకరణ అంశం తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్నట్లుగానే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంటే..

Crop War - Bjp vs Trs: వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి.. సీఎంకు బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్..
Bandi Sanjay Kumar
Follow us

|

Updated on: Mar 24, 2022 | 5:46 PM

Bjp vs Trs: వరి సేకరణ అంశం తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్నట్లుగానే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంటే.. సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ రాసిన లేఖలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అవాస్తవాలున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌వి అబద్ధాలేనని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆధారాలతో సహా తేల్చారని పేర్కొన్నారు.

వడ్లను రాష్ట్రమే కొనాలి.. వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి.. లేనిపక్షంలో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బండి సజయ్ తన లేఖలో డిమాండ్ చేశారు. పంజాబ్ అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం బియ్యం సేకరిస్తుందే తప్ప ధాన్యం సేకరించడం లేదన్నారు. కేంద్రం యాసంగిలో వరి ధాన్యం కొనబోమన్నది అబద్ధమన్నారు. వానాకాలం మాదిరిగానే యాసంగిలోనూ సేకరిస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ధాన్యం సేకరణలో పెద్ద కుంభకోణం దాగి ఉందనిపిస్తోందన్నారు. మిల్లర్లతో కుమ్మక్కై రేషన్ బియ్యం రీ సైక్లింగ్, లేని పంటను లెక్కల్లో చూపడం, పక్క రాష్ట్రాల్లోని బియ్యాన్ని తెచ్చి అమ్మినట్లు సమాచారముందని సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్. టీఆర్ఎస్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే రైతులు పండించిన ధాన్యాన్ని, ప్రతీ గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల జీవితాలతో రాజకీయం చేస్తే బీజేపీ చూస్తూ ఉరుకోదని, రైతులకు అండగా ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.

Also read:

Andhra Pradesh: ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసం చేసిన ఐఏఎస్ అధికారి.. గిరిజనుల రియాక్షన్ ఇదీ..!

TISS Mumbai Recruitment 2022: టిస్‌ ముంబాయిలో ఉద్యోగావకాశాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

MS Dhoni Quits CSK Captaincy: ధోనీ కెరీర్‌లో 3 వివాదాలు.. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రపంచమే షాక్.. అవేంటంటే?