టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే..

త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే తమకు పోటీ అన్న.. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలపై తన మనసులో ఉన్న భయాన్ని కేటీఆర్ బయట పెట్టారన్నారు బీజేపీ అధికార ప్రతినిధి కె. కృష్ణ సాగర్. టీఆర్ఎస్‌కి కాంగ్రెస్ ఒక్కటే ప్రతిపక్షం అనడంతో.. బీజేపీని చూసి టీఆర్ఎస్ భయపడుతోందని అర్ధమవుతోందన్నారు. గత రెండు ఎన్నికల్లో టిఆర్ఎస్ కేవలం గాలివాటం, అదృష్టం కలిసి రావడం వల్లే గెలుపు సాధ్యమైందన్నారు. సొంతంగా ఎన్నికల్లో పోరాడి […]

టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే..
Follow us

| Edited By:

Updated on: Jan 02, 2020 | 1:17 AM

త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే తమకు పోటీ అన్న.. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలపై తన మనసులో ఉన్న భయాన్ని కేటీఆర్ బయట పెట్టారన్నారు బీజేపీ అధికార ప్రతినిధి కె. కృష్ణ సాగర్. టీఆర్ఎస్‌కి కాంగ్రెస్ ఒక్కటే ప్రతిపక్షం అనడంతో.. బీజేపీని చూసి టీఆర్ఎస్ భయపడుతోందని అర్ధమవుతోందన్నారు. గత రెండు ఎన్నికల్లో టిఆర్ఎస్ కేవలం గాలివాటం, అదృష్టం కలిసి రావడం వల్లే గెలుపు సాధ్యమైందన్నారు. సొంతంగా ఎన్నికల్లో పోరాడి గెలిచే నిర్మాణం, వ్యవస్థలు టీఆర్ఎస్‌కు లేవన్నారు.

ఆ కుటుంబంలో ఇద్దరు తప్ప, రాష్ట్రంలో ఎక్కడా ఆ పార్టీ వ్యవస్థాగత – సంస్థాగత నిర్మాణం లేదని ఎద్దేవ చేశారు. ప్రతిసారి ప్రాంతీయ విభజన రాజకీయాలతో.. ప్రజల్లో ఉన్న భావోద్వేగాలను రెచ్చగొట్టి వాడుకోవడం, మైనార్టీలను బుజ్జగించడం తప్ప ఎన్నికల్లో గెలవడానికి టిఆర్ఎస్ పార్టీ దగ్గర మరో వ్యూహం లేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి ఎంటో చెప్పి.. ఎన్నికల్లో వెళ్తే.. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమేనని కృష్ణసాగర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని లెక్కల్లోంచి తీసేశారని.. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌ పార్టీని రిజెక్ట చేస్తారన్నారు. ఇక అన్ని మునిసిపల్ ఎలక్షన్ స్థానాల్లో ఈసారి కూడా ఒంటిరిగానే పోటీకి దిగుంతని బీజేపీ స్పష్టం చేసింది.