AP – Telangana: ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం.. ఆంధ్రా నుంచి వచ్చే ధాన్యం వాహనాలకు బ్రేక్‌..

ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం రాజుకుంది. ఏపీ నుంచి వచ్చే ధాన్యం లారీలను అడ్డుకుంటున్నారు తెలంగాణ అధికారులు. సరిహద్దుల్లోనే లారీలకు బ్రేకులు వేస్తున్నారు. దీనికి కారణం ఏంటి ?

AP - Telangana: ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం.. ఆంధ్రా నుంచి వచ్చే ధాన్యం వాహనాలకు బ్రేక్‌..
Toll Plaza

AP – Telangana: ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం రాజుకుంది. ఏపీ నుంచి వచ్చే ధాన్యం లారీలను అడ్డుకుంటున్నారు తెలంగాణ అధికారులు. సరిహద్దుల్లోనే లారీలకు బ్రేకులు వేస్తున్నారు. దీనికి కారణం ఏంటి ? అకస్మాత్తుగా తెలంగాణ అధికారులు ఈ నిర్ఱయం ఎందుకు తీసుకున్నారు ? అయితే ఆంధ్రా రైతులు మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు. చట్ట ప్రకారమే తాము ఆంధ్రా నుంచి తెలంగాణకు ధాన్యాన్ని తీసుకొస్తున్నామని, అయితే అకారణంగా అడ్డుకుంటున్నారని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వే బిల్లులతో పాటు అన్ని సక్రమంగానే ఉన్నాయని చెబుతున్నారు.

ఏపీలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కనీవినీ ఎరగని రీతిలో వర్షాలు కురిసి, వరదలు ముంచెత్తాయి. ఇలాంటి సమయంలో తాము ధాన్యాన్ని నిల్వచేయలేమని, తెలంగాణకు ధాన్యం వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటే తమ పరిస్థితి ఏంటని ఆంధ్రా రైతులు ప్రశ్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై స్పందించి, ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఇటు ఏపీ నుంచి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు తెలంగాణలో ఉన్న వ్యాపారులు కూడా భయపడుతున్నారు. ఒకవేళ కొనుగోలు చేస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసిందే.

ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో ఫైట్‌ చేస్తోంది తెలంగాణ. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని, పంజాబ్‌ లాంటి రాష్ట్రాలకు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయమా ? అని ప్రశ్నిస్తోంది. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగానే ఇటు ఆంధ్రా నుంచి వచ్చే ధాన్యం లారీలను అడ్డుకుంటున్నారు తెలంగాణ అధికారులు. ఇది మరో వివాదానికి దారి తీస్తోంది.

మరోవైపు తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై ఇవాళ కేంద్రం క్లారిటీ ఇవ్వనుంది. దీనిపై కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌తో భేటీ కానున్నారు తెలంగాణ వ్యవసాయశాఖమంత్రి నిరంజన్‌రెడ్డి. 2021-22 ఖరీఫ్‌, రబీ సీజన్‌లో కేంద్రం కొనుగోలు చేసే ధాన్యం కోటాపై చర్చించనున్నారు. కేంద్రం ఎంత ధాన్యం సేకరిస్తుందో చెబితే రబీ సీజన్‌లో ఆ మేరకే సాగు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. మరోవైపు బాయిల్డ్‌ రైస్‌పై ఇప్పటికే స్పష్టం ఇచ్చింది కేంద్రం. దీంతో ఇవాళ్టి కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి: Success Mantras: విజయానికి నాలుగు మెట్లు.. వీటిని అర్థం చేసుకున్న వారికి ఏదీ అసాధ్యం కాదు..

Constitution Day 2021: నవంబర్ 26 ప్రత్యేక ఏంటో తెలుసా.. ప్రతి ఒక్కరు ఈ రోజు స్పెషల్ ఎంటో తెలుసుకోవాలి..

Click on your DTH Provider to Add TV9 Telugu