Telangana Assembly Session: అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు.. ఆ రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం..

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు ( అసెంబ్లీ సమావేశాలు ) ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మూడో తేదీ మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభమవుతాయి. ఆ రోజే బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టే...

Telangana Assembly Session: అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు.. ఆ రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం..
Telangana Assembly
Follow us

|

Updated on: Jan 21, 2023 | 8:56 PM

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు ( అసెంబ్లీ సమావేశాలు ) ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మూడో తేదీ మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభమవుతాయి. ఆ రోజే బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టే అవ‌కాశం ఉంది. ఈ మేరకు అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాల‌పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు స‌మాచారం అందించారు. తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ 2023-24 ప్రతిపాద‌న‌ల‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ శ‌నివారం మ‌ధ్యాహ్నం స‌మీక్ష నిర్వహించారు. ఈ స‌మావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు హాజ‌ర‌య్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాగా.. 2022-23లో ప్రభుత్వ వ్యయం ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు దాటినట్టు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నాయి. అవి కూడా కలుపుకొంటే రూ.2.10 లక్షల కోట్ల నుంచి రూ.2.15 లక్షల కోట్ల వరకు లెక్క తేలుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..