TS Assembly Budget Session: మరికాసేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 11 గంటలకు గవర్నర్ ప్రసంగం..

Telangana Assembly Budget Session 2021: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి.

TS Assembly Budget Session: మరికాసేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 11 గంటలకు గవర్నర్ ప్రసంగం..
Follow us

|

Updated on: Mar 15, 2021 | 8:37 AM

Telangana Assembly Budget Session 2021: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆ మేరకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమావేశాలు ప్రారంభమైన వెంటనే.. అంటే 11 గంటలకు గవర్నర్ తమిళిసై సభలో ప్రసంగించున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలి, అజెండా, తదితర అంశాలపై చర్చించి, ఆ నిర్ణయాలను ఫైనల్ చేస్తారు.

18వ తేదీన బడ్జెట్.. తొలిరోజు సమావేశాలు గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడుతాయి. ఇక మరుసటి రోజు అంటే 16వ తేదీన సమావేశాల్లో దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాపం తీర్మానం ప్రవేశపెడతారు. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. 17వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపుతూ సభలో సభ్యులు ప్రసంగిస్తారు. ఆ సందర్భంగా పలు అంశాలపై ముక్తసరిగా చర్చ జరుపుతారు. ఈనెల 18వ తేదీన ఆర్థిక మంత్రి హరీష్ రావు రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడుతారు. సరిగ్గా 11.30 గంటలకు మంత్రి హరీష్ రావు బడ్జెట్‌పై ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. దానికి ముందు బడ్జెట్ ప్రతులను ఉభయ సభల సభ్యులకు అందజేస్తారు. బడ్జెట్ ప్రసంగం అయిపోయాక సభను వాయిదా వేస్తారు. బడ్జెట్ అధ్యయనం కోసం 19న సభకు సెలవు ఉంటుంది. ఇక 20వ తేదీ నుంచి సమావేశాలు యధావిధిగా మొదలవుతాయి.

ప్రజాప్రతినిధులకు కరోనా టెస్టులు.. ఇదిలాఉంటే.. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల సభ్యులకు కరోనా టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులకు అసెంబ్లీ ఆవరణలోనే కరోనా టెస్ట్‌లు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు చాలా మంది కరోనా బారిన పడ్డారు.

Also read:

బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యింది

Hindu Temple in Pakistan: పాకిస్తాన్‌లో హిందూ ఆలయం ధ్వంసం.. నిందితులను క్షమిస్తున్నట్లు ప్రకటించిన హిందూ సంఘాలు..