మానవత్వం చాటిన సబ్ రిజిస్టార్ తస్లీమా.. తాను తెచ్చుకున్న లంచ్‌ బాక్స్‌ను మతిస్థిమితం లేని వ్యక్తికి తినిపించిన వైనం

మానవత్వం ఇంకా బతికే ఉంది. ఇలాంటి వారు సమాజంలో చాలా తక్కువగా ఉంటారు. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు అంటుంటారు. కానీ తాను మాత్రం అంతకు మించి మానవతా

  • Subhash Goud
  • Publish Date - 6:06 am, Thu, 4 March 21
మానవత్వం చాటిన సబ్ రిజిస్టార్ తస్లీమా.. తాను తెచ్చుకున్న లంచ్‌ బాక్స్‌ను మతిస్థిమితం లేని వ్యక్తికి తినిపించిన వైనం

మానవత్వం ఇంకా బతికే ఉంది. ఇలాంటి వారు సమాజంలో చాలా తక్కువగా ఉంటారు. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు అంటుంటారు. కానీ తాను మాత్రం అంతకు మించి మానవతా దృక్పథంతో స్పందించింది. మతిస్థిమితం లేక ఆకలితో అలమటిస్తున్న ఓ అభాగ్యుడు.. రోడ్డుపై తిరుగుతున్న దృశ్యాన్ని చూసి తస్లీమా చలించిపోయింది. వెంటనే తాను తెచ్చుకున్న లంచ్‌ బాక్స్‌లో ఉన్న అన్నం తీసి తినిపించి శభాష్‌ అనిపించుకుంది. ఇలా తన లంచ్‌ బాక్స్‌ని తినిపించి మానవత్వాన్ని చాటారు ఓ మహిళా ఉద్యోగి.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని ములుగు సబ్‌ రిజిస్టార్‌గా తస్లీమా అనే మహిళా విధులు నిర్వహిస్తోంది. అయితే ప్రతి రోజులాగే వెంట లంచ్‌ బాక్స్‌ తెచ్చుకుంటుంది. ఇంతలో ఓ మతిస్థితం లేని వ్యక్తి ఆకలితో రోడ్డుపై అటు ఇటు తిరుగుతున్న దృశ్యాన్ని చూపి తస్లీమా చలించి మంచి మనసును చాటుకుంది. వెంటనే తాను తెచ్చుకున్న లంచ్‌ బాక్స్‌లోంచి అన్నంతీసి ఆమెనే స్వయంగా ఆ మతిస్థిమితం లేని వ్యక్తికి తినిపించింది. తస్లీమా మంచి మనసుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ప్రస్తుతం కాలంలో ఇలాంటి వారు ఉండటం చాలా అరుదు. ఈ రోజుల్లో స్వార్థంగా ఆలోచించే వారు చాలా మంది ఉంటారు. తస్లీమా లాంటి మంచి మనసు ఉన్నవారు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి మంచి మనసు ఉన్న తస్లీమాను పలువురు అభినందిస్తున్నారు. తస్లీమా చేసింది చాలా గొప్ప విషయమని ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Good News: అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఉచిత సేవా కేంద్రం.. తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు

Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్లు వాడే వారికి గొప్ప శుభవార్త.. కొత్త రూల్స్‌ తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అదేంటంటే..!