Telangana: సిద్ధిపేట గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌.. కొంప ముంచిన చికెన్‌, వంకాయ కర్రీ..

Telangana: సిద్ధిపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌ ఘటన కలకలం రేపింది. సోమవారం జరిగిన ఈ సంఘటనలో 107 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు...

Telangana: సిద్ధిపేట గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌.. కొంప ముంచిన చికెన్‌, వంకాయ కర్రీ..
Follow us

|

Updated on: Jun 28, 2022 | 10:01 AM

Telangana: సిద్ధిపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌ ఘటన కలకలం రేపింది. సోమవారం జరిగిన ఈ సంఘటనలో 107 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అధికారులు విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట మైనారిటీ పాఠశాలలో విద్యార్థులకు ఆదివారం రాత్రి డిన్నర్‌లో భాగంగా చికెన్‌తో వంకాయను కలిపి ఇచ్చారు.

దీంతో ఈ ఆహారం తీసుకున్న విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడగా సోమవారం నాటికి కడుపు నొప్పి మరింత పెరగడంతో వెంటనే చికిత్స కోసం సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఫుడ్‌ పాయిజన్‌కు సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

స్పందించిన హరీశ్ రావు..

ఈ నేపథ్యంలోనే సమాచారం తెలుసుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీష్‌ రావు వెంటనే స్పందించారు. అధికారులను విషయమై ఆరా తీసి, వెంటనే విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..