కుటుంబంలో ఒక్కటైన కాకి.. నల్గొండ జిల్లాలో వింత ఘటన
నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ షేక్ యూసుఫ్ - సాఫియా కుటుంబం ఉంటుంది. ఇంటి ఆరు బయట ఆహార పదార్థాలతో పాటు, కుళ్ళిపోయిన పండ్లను తినేందుకు పక్షులు వచ్చాయి. ఇందులో ఓ కాకి మాత్రం కావు..కావు మంటూ ప్రతిరోజు యూసఫ్ ఇంటికి వచ్చేది. దీంతో ఆ కాకిని వెరైటీగా పెంచుకుంటున్నారు. యూసఫ్ కుటుంబంతో ఏడాదిగా ఈ కాకి కలిసి ఉంటోంది.

సాధారణంగా పెంపుడు జంతువులుగా కుక్క పిల్లలు, పిల్లులను పెంచుకుంటారు. పెంపుడు పక్షులుగా రామ చిలుకను పెంచుకుంటారు. కానీ ఈ కుటుంబం మాత్రం విచిత్రంగా వెరైటీగా ఓ పక్షిని పెంచుకుంటున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ షేక్ యూసుఫ్ – సాఫియా కుటుంబం ఉంటుంది. ఇంటి ఆరు బయట ఆహార పదార్థాలతో పాటు, కుళ్ళిపోయిన పండ్లను తినేందుకు పక్షులు వచ్చాయి. ఇందులో ఓ కాకి మాత్రం కావు..కావు మంటూ ప్రతిరోజు యూసఫ్ ఇంటికి వచ్చేది. దీంతో ఆ కాకిని వెరైటీగా పెంచుకుంటున్నారు. యూసఫ్ కుటుంబంతో ఏడాదిగా ఈ కాకి కలిసి ఉంటోంది. ప్రతిరోజు ఉదయం యూసఫ్ ఇంటికి వచ్చి.. సాయంత్రం వరకు ఉంటుంది. సాయంత్రం తిరిగి తన గూటికి వెళుతోంది ఈ కాకి.
ప్రతిరోజు ఇంటికి వచ్చే కాకిని యూసఫ్ కుటుంబం కూడా కుటుంబ సభ్యుడిగానే పరిగణించేది. దీంతో వారు కాకికి పళ్ళు, అన్నం, చికెన్ ఆహారంగా పెట్టేవారు. రోజు ఇంటికి వస్తున్న కాకి రెండు రోజులుగా ఆహారం తీసుకోవడం లేదు. దీంతో ఆందోళన చెందినా యూసఫ్ ఆ కాకిని స్థానిక వెటర్నరీ హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు. పశు వైద్యుడు పరీక్షించి ఆ కాకికి చికిత్స చేశాడు. తిరిగి కోలుకున్న ఆ కాకి యధావిధిగా ఆహారం తీసుకుంటుంది. నిత్యం కావు కావు మంటూ యూసఫ్ ఇంటికి వచ్చి సాయంత్రం వరకు ఉంటుంది. ఆ కాకితో తమకి ఎలాంటి సంబంధం ఉందో తెలియదు కానీ దానిని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నామని యూసఫ్ కుటుంబం చెబుతోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
