Telangana: వలలో చిక్కిన వింత చేప.. ఒళ్లంతా నలుపు, తెలుపు మచ్చలు… నోరు కూడా వెరైటీగా

ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో వింత చేపలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో ఇతర ప్రాంతాలు నుంచి ఇవి కొట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana: వలలో చిక్కిన వింత చేప.. ఒళ్లంతా నలుపు, తెలుపు మచ్చలు... నోరు కూడా వెరైటీగా
Variety Fish
Follow us

|

Updated on: Jul 11, 2022 | 3:38 PM

variety fish: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా వానలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. ఈ మధ్య చేపల వర్షం గురించి కూడా మన దగ్గర తెగ వింటున్నాం. వర్షంతో పాటు చేపలు కూడా పడటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాదు వింత చేపలు సైతం ఈ మధ్య వలలకు చిక్కుతున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District)లో వింత చేప ప్రత్యక్షమైంది. దమ్మ పేటలోని అప్పారావుపేట చెరువులో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు వింత చేప చిక్కింది. ఆ చేప ఒంటిపై నలుపు, తెలుపు మిళితమైన మచ్చలు కలిగి ఉంది. అంతే కాదు చేప నోరు కూడా కింది భాగంలో ఉంది. ఈ విషయం తెలియడంతో వింత చేపను చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు. ఇదివరకెప్పుడూ ఇలాంటి చేపను చూడలేదంటున్నారు స్థానికులు.

అసలు చేపల వర్షం కురుస్తుందా…?

సముద్ర తీర ప్రాంతాల్లో, నదీ తీరాలు, చెరువుల సమీప ప్రాంతాల్లో సుడిగాలులు  వచ్చిన సమయంలో నీటితో పాటు చేపలు ఎగిరి మేఘాలలో చిక్కుకుంటాయి. అక్కడే అవి ఘనీభవించి కొద్దిదూరం ప్రయాణిస్తాయి. ఆ మేఘాలు కరిగి వర్షంగా కురిసినప్పుడు వాటిలోని చేపలు కూడా నేలమీద పడతాయని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణ వార్తల కోసం