Special Trains: ప్రయాణికుల రద్దీ.. ఆ స్పెషల్ ట్రైన్స్ పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటన

కరోనా సీజన్, అయినా కానీ జనాలు ప్రయాణాలు మానుకోవడం లేదు. సంక్రాంతి పండుగ  కావడంతో ఇప్పటికే చాలామంది సొంతూర్లకు పెళ్లిపోయారు.

Special Trains: ప్రయాణికుల రద్దీ.. ఆ స్పెషల్ ట్రైన్స్ పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటన
Sankranti Special Trains

AP Special Trains: కరోనా సీజన్, అయినా కానీ జనాలు ప్రయాణాలు మానుకోవడం లేదు. సంక్రాంతి పండుగ  కావడంతో ఇప్పటికే చాలామంది సొంతూర్లకు పెళ్లిపోయారు. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి పండుగ బాగా జరపుకుంటారన్న విషయం తెలిసిందే. దీంతో వివిధ దేశాలతో పాటు దేశంలోని వేర్వేరు రాష్ట్రాలలో ఉంటున్న వారు సొంతూర్లకు క్యూ కట్టారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా నడిచే పలు ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి వరకు పొడిగించినట్లు మండల రైల్వే అధికారి గురువారం ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం- సికింద్రాబాద్‌-విశాఖపట్నం(08579-08580) ట్రైన్ ను ఫిబ్రవరి 2 నుంచి 24వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం (08585-08586) ట్రైన్ ను ఫిబ్రవరి 1 నుంచి 23వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. భువనేశ్వర్‌ నుంచి బెంగళూరు వెళ్లే రైలు(18463), బెంగుళూరు నుంచి భువనేశ్వర్‌కు వచ్చే రైలు(18464)కు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రయాణీకులు కరోనా నిబంధనలు పాటిస్తూ.. రైళ్లలో ప్రయాణించాలని సూచించారు.

Also Read: అక్క ఆడపడుచుతో ప్రేమలో పడ్డ యువతి.. చివరికి ఊహించని ట్విస్ట్

Published On - 8:02 am, Fri, 14 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu