తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న మరో 6 ప్రత్యేక రైళ్లు.. ఎప్పుడంటే.!

South Central Railway: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే..

  • Ravi Kiran
  • Publish Date - 11:39 am, Sat, 27 February 21
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న మరో 6 ప్రత్యేక రైళ్లు.. ఎప్పుడంటే.!
Train Moves In Reverse

South Central Railway: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణ మధ్య రైల్వే మరో ఆరు రైళ్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునరుద్దరించేందుకు సిద్దమైంది. ఈ ఆరు ట్రైన్స్‌లో రెండు డైలీ మెయిల్ సర్వీసులు కాగా.. మరో నాలుగు వీక్లీ ట్రైన్స్ అని ఎస్‌సీఆర్ జన‌రల్‌ మేనే‌జర్‌ గజా‌న‌న్‌‌మాల్యా తెలి‌పారు. వీటితో పాటు మరో 22 ట్రైన్స్ కలిపి మొత్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 28 రైళ్లను పునరుద్దరించనున్నట్లు తెలిపారు. కాగా, కరోనా లాక్ డౌన్ కారణంగా ఆపేసిన ప్యాసింజర్ రైళ్లను మాత్రం మళ్లీ తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామన్న దానిపై తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.

ప్రారంభం కానున్న ట్రైన్స్ వివరాలు ఇల్లా ఇలా ఉన్నాయి..

సికింద్రాబాద్ – కర్నూలు సిటీ(మెయిల్ ఎక్స్‌ప్రెస్): ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సికింద్రాబాద్‌లో ఉదయం 7.40 గంటలకు బయల్దేరి.. కర్నూలు సిటీకి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుతుంది.

కర్నూలు సిటీ- సికింద్రాబాద్(మెయిల్ ఎక్స్‌ప్రెస్): ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కర్నూలు సిటీలో మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి.. సికింద్రాబాద్‌కు రాత్రి 7.50 గంటలకు చేరుతుంది.

తిరుపతి – వాస్కోడగామా(మెయిల్ ఎక్స్‌ప్రెస్): ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ తిరుపతిలో ఉదయం 11.40 గంటలకు బయల్దేరి.. వాస్కోడగామాకు మరుసటి రోజు ఉదయం 5.25 గంటలకు చేరుతుంది. ఈ ట్రైన్ ప్రతీ గురువారం నడుస్తుంది.

వాస్కోడగామా- తిరుపతి(మెయిల్ ఎక్స్‌ప్రెస్): ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వాస్కోడగామాలో ఉదయం 9 గంటలకు బయల్దేరి.. తిరుపతికి మరుసటి రోజు తెల్లారుజామున 2.55 గంటలకు చేరుతుంది. ఈ ట్రైన్ ప్రతీ శుక్రవారం నడుస్తుంది.

హైదరాబాద్ – వాస్కోడగామా(మెయిల్ ఎక్స్‌ప్రెస్): ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ హైదరాబాద్‌లో ఉదయం 9 గంటల 15 నిమిషాలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 5 గంటల 25 నిమిషాలకు వాస్కోడగామాకు చేరుతుంది.

వాస్కోడగామా – హైదరాబాద్(మెయిల్ ఎక్స్‌ప్రెస్): ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వాస్కోడగామాలో ఉదయం 9 గంటలకు బయల్దేరి.. హైదరాబాద్‌కు మరుసటి రోజు ఉదయం 7 గంటల .20 నిమిషాలకు చేరుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

కస్టమర్‌పై అరిస్తే.. డెలివరీ బాయ్‌ను మంచి పని చేశావంటున్నారు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి టీమిండియా.. అదే జరిగితే టోర్నీ నుంచి ఔట్.!

న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!