Telangana: త్వరలోనే ఆ ఖాళీల భర్తీ.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన విద్యాశాఖ మంత్రి

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కీలక విషయాలపై అధికారులతో చర్చించారు.

Telangana: త్వరలోనే ఆ ఖాళీల భర్తీ.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన విద్యాశాఖ మంత్రి
Sabitha Indra Reddy
Follow us

|

Updated on: Feb 16, 2022 | 9:11 PM

Sabitha Indra Reddy : యూనివర్సిటీల వీసీలతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎస్, ఉన్నత విద్యా మండలి అధికారులు,  వీసీలు హాజరయ్యారు. విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కోసం శిక్షణ కోసం యూనివర్సిటీలు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. త్వరలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్లు రానున్నందున స్టూడెంట్స్‌ను సన్నద్ధం చేసేందుకు యూనివర్సిటీలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే కేటాయిస్తుందని తెలిపారు. వర్సిటీల భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. ఇండస్ట్రీలకు యూనివర్సిటీ‌ల అనుసంధానం చేయాలని, అలాగే పరిశోధనలు పెంచాలని ఆదేశించారు.  పరిశ్రమలు, పరిశోధన సంస్థలతో యూనివర్సిటీలు నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. లక్ష్యసాధన కోసం విద్యార్థుల్లో సంకల్పాన్ని కల్పించడంతో పాటు.. ఆ దిశలో అడ్డంకులను ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని నింపాలన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సులను గుర్తించాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. వర్సిటీలో చదివే విద్యార్థి ఉద్యోగంతోనే బయటకు వెళ్లేలా కరికులం ఉండాలన్నారు.  ప్రైవేట్ యూనివర్సిటీ‌లకు దీటుగా ప్రభుత్వ వర్శిటీలు తయారు కావాలని ఆకాక్షించారు.

పరిశోధనలే యూనివర్సిటీలకు ప్రామాణికంగా ఉంటాయని.. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంలోనూ దోహద పడతాయని మంత్రి అన్నారు. యూనివర్సిటీల్లో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. సమావేశంలో సీఎస్ సోమేశ్​ కుమార్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

Also Read: కారంపొడి, పచ్చి మిర్చి రెండింటిలో ఏది బెటర్.. ఈ విషయాలు మీరు అస్సలు నమ్మలేరు

Viral Photo: అపరంజి బొమ్మ.. అందాల జాబిల్లి.. అప్పట్లో తెలుగునాట సెన్సేషన్.. ఎవరో గుర్తించారా..?

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..