Adilabad – RIMS: నెరవేరిన ఆరేళ్ల కల.. రేపటి నుండే అందుబాటులోకి సేవలు..

Adilabad - RIMS: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి.

Adilabad - RIMS: నెరవేరిన ఆరేళ్ల కల.. రేపటి నుండే అందుబాటులోకి సేవలు..
Harish Rao
Follow us

|

Updated on: Mar 04, 2022 | 6:30 AM

Adilabad – RIMS: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఘనంగా ప్రారంభించారు. రూ. 150 కోట్లతో ఏర్పాటు చేసిన అదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆదిలాబాద్ ప్రజలకు అకింతమిచ్చారు. రేడియాలజీ ల్యాబ్ ను ప్రారంబించిన మంత్రి హరీశ్ రావు.. రేపటి నుండి ట్రయల్ రన్ ను ప్రారంభించి వీలైనంత త్వరగా మిగిలిన అన్ని రకాల సూపర్ సేవలను ప్రారంభించాలని రిమ్స్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖా నాయక్, రాథోడ్ బాపురావు, ఎమ్మెల్సీ విఠల్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొ‌న్నారు. ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. ఆస్పత్రి నిర్వహణ కోసం ఏడాదికి రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడారు.

ఢిల్లీలో మెచ్చుకుంటారు.. గల్లీలో రోడ్డుకు అడ్డం పడుతారు.. ఇదే సమయంలో బీజేపీ నేతల తీరుపై మంత్రి హరీష్ రావు విమర్శల వర్షం కురిపించారు. ఢిల్లీలో ఒకలా.. గల్లీలో ఒకలా ప్రవర్తిస్తున్నారంటూ దుయ్యబట్టారు. దేశంలో తెలంగాణ బెస్ట్ అని నీతి ఆయోగ్ చెప్పింది. కరోనా కట్టడిలో బాగా పని చేశామని హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సైతం తెలంగాణ వైద్య సేవలను కొనియాడిందని తెలిపారు. మారుమూల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లో మెరుగైన వైద్య సేవలు అందించడం ఇక్కడి గల్లీ లీడర్లకు ఇష్టం లేనట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ వైద్య సేవలను కేంద్రంలో మంత్రులు మెచ్చుకుంటుంటే గల్లీలో మాత్రం బచ్చాలీడర్లు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఆదిలాబాద్ సీసీఐని పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పేదలకు అద్భుత వైద్యం అందిస్తున్న మూడో రాష్ట్రం తెలంగాణ అని రాజ్యసభలో కేంద్రం చెప్పింది. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీ చిట్ట చివరి స్థానంలో ఉందని చెప్పింది. ఇక మీకే తెలియాలి‌ ఎవరి పాలనలో మెరుగైన వైద్యం అందుతుందో అన్నారు మంత్రి‌ హరీష్ రావు. మాకు ఢిల్లీలో బాసులు లేరు.. గల్లీల్లో ఉన్న ప్రజలే మాకు బాసులు. వారి సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నాం.. ఇంకా చేస్తామని పేర్కొన్నారు మంత్రి. ఇద్దరు ముగ్గురు రావడం, ఒకడు కార్లకు అడ్డం పడటం, ఇంకొకడు వీడియో తీసుకోవడం.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసుకోవడం.. ఇలాంటి సోషల్ మీడియా తోకలను పెద్దగా పట్టించుకోం. అభివృద్దికి అడ్డుపడితే చూస్తూ ఊరుకోం. కాళ్లల్లో కట్టెలు పెట్టేవారిని ఊరికే వదిలిపెట్టమని తీవ్ర స్వరంతో హెచ్చరించారు మంత్రి హరీష్ రావు.

తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో చెప్పాలి.. దేశంలో ఏడేండ్లలో కొత్తగా 7 ఐఐఎంలు కేటాయిస్తే అందులో తెలంగాణకు కేటాయించినవి సున్నా. ఐఐటీలు 7 ఏర్పాటు చేస్తే తెలంగాణకు ఇచ్చినవి సున్నా. ఐఐఎస్‌ఈఆర్‌లు రెండు నెలకొల్పితే.. తెలంగాణలో నెలకొల్పినవి సున్నా. ట్రిపుల్ ఐటీలు దేశవ్యాప్తంగా 16 ఏర్పాటు చేస్తే.. తెలంగాణలో ఏర్పాటుచేసినవి సున్నా.. దేశవ్యాప్తంగా 16 ఏర్పాటు చేస్తే.. తెలంగాణలో ఏర్పాటుచేసినవి సున్నా.. ఎన్‌ఐడీలు దేశంలో నాలుగు పెడితే.. తెలంగాణలో పెట్టినవి సున్నా.. వివిధ రాష్ర్టాల్లో మొత్తం 157 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటుచేస్తే.. తెలంగాణలో ఏర్పాటు చేసినవి సున్నా.. నవోదయ పాఠశాలలు కొత్తగా 84 నెలకొల్పితే.. తెలంగాణలో సున్నా.. కనీసం విభజన హామీలు కూడా నెరవేర్చని సన్నాసులు మా అభివృద్ది అడ్డుపడటం దిగజారుడు వ్యవహారం అన్నారు మంత్రి హరీష్ రావు. ఎవరూ ఎన్ని అడ్డంకులు పెట్టినా తెలంగాణ అభివృద్ధి ఆగదు. తెలంగాణ బస్తీలో ఉండే ప్రజలే మాకు బాసులని తెలిపారు మంత్రి.

– నరేష్ స్వేన, టీవి9 తెలుగు, ఉమ్మడి ఆదిలాబాద్

Also read:

Mirchi High Rates: ఘాటెక్కిన పచ్చిమర్చి.. రేటు చూస్తే గుండె గుభేలే..!

Hyderabad: భాగ్యనగర వాసులకు ఇక ఢోకా లేనట్లే!.. అవసరమైన వారికి ఉచితంగా ఇచ్చేందుకు..

Viral Video: బైక్ రైడర్ అవతారమెత్తిన ముఖ్యమంతి.. రెడ్ జాకెట్, సన్‌ గ్గాసెస్‌తో రచ్చ.. వైరల్‌ అవుతున్న వీడియో..

సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా