బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియకు చుక్కెదురు.. బెయిల్ విషయంలో మళ్లీ నిరాశే

బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియకు చుక్కెదురు.. బెయిల్ విషయంలో మళ్లీ నిరాశే

బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది.

Ram Naramaneni

|

Jan 18, 2021 | 3:17 PM

Akhila priya bail petition:  బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌ను  సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. అఖిల ప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు పోలీసులు మెమో దాఖలు చేశారు.  ఐపీసీ సెక్షన్ 395 డెకయిట్ (దోపిడీ)కేసు నమోదు చేశారు పోలీసులు. జీవిత కాలం శిక్ష పడే కేసులు తమ పరిధిలోకి రావని సికింద్రాబాద్ కోర్టు పేర్కొంది. దీంతో బెయిల్ పిటిషన్ సికింద్రాబాద్ కోర్టు రిటర్న్ చేసింది. దీంతో నాంపల్లి కోర్టులో అఖిల ప్రియ తరుపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయనున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బోయిన్‌పల్లి కిడ్నాప్ పోలీసులు మరో కీలక వ్యక్తిని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కిడ్నాప్‌ కోసం అతడు మనుషులను సరఫరా చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే అతను కనిపించకుండాపోయాడు. కొంతకాలంగా గోవాలో తలదాచుకుంటున్న అతడిని పక్కా సమాచారం అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఝలక్.. ఇతర పార్టీల్లో చేరుతున్న అభిమానులు..అధిష్టానం స్పందన ఏంటంటే..?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu