మరో శ్రీమంతుడు ఆ గ్రామ సర్పంచ్..

మీరు శ్రీమంతుడు సినిమా చూశారా..? అందులో హీరో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధికి పాటుపడతాడు. అలాగే అక్కడక్కడ కొంతమంది ప్రజా ప్రతినిధులు కూడా తమ సొంత డబ్బును వెచ్చించి ఊరికి ఉపకారం చేస్తుంటారు. అదే కోవలోకే వస్తారు వికారాబాద్ జిల్లా పెండ్లిమడుగు గ్రామ సర్పంచ్. ఆయన గ్రామంలో సొంత ఖర్చులతో గ్రామాభివృద్దికి కృషిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గ్రామ సర్పంచ్ బుచ్చిరెడ్డి సొంత డబ్బుతో గ్రామంలో స్కూల్‌ను బాగు చేయడం, తన పిల్లలతో పాటు, గ్రామంలో […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:48 pm, Sat, 6 July 19
మరో  శ్రీమంతుడు   ఆ గ్రామ సర్పంచ్..

మీరు శ్రీమంతుడు సినిమా చూశారా..? అందులో హీరో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధికి పాటుపడతాడు. అలాగే అక్కడక్కడ కొంతమంది ప్రజా ప్రతినిధులు కూడా తమ సొంత డబ్బును వెచ్చించి ఊరికి ఉపకారం చేస్తుంటారు. అదే కోవలోకే వస్తారు వికారాబాద్ జిల్లా పెండ్లిమడుగు గ్రామ సర్పంచ్. ఆయన గ్రామంలో సొంత ఖర్చులతో గ్రామాభివృద్దికి కృషిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

గ్రామ సర్పంచ్ బుచ్చిరెడ్డి సొంత డబ్బుతో గ్రామంలో స్కూల్‌ను బాగు చేయడం, తన పిల్లలతో పాటు, గ్రామంలో ఉన్న పిల్లలంతా ఇదే పాఠశాలలో చదివేందుకు సహకరించాడు. తానే మరుగుదొడ్లు శుభ్రం చేసి, గ్రామానికి సీసీ రోడ్లను వేయించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు సర్పంచ్ బుచ్చిరెడ్డి.

గ్రామం మనకేమిచ్చింది అనే దానికంటే గ్రామానికి మనం ఏమిచ్చామనే విధంగా నిరంతరం కృషిచేస్తున్నాడు సర్పంచ్ బుచ్చిరెడ్డి. ఆయన సేవలపై గ్రామస్తులంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తు అభినందిస్తున్నారు.