కుల వృత్తికి సాటి ఏది..? కత్తెర పట్టిన ఆర్టీసీ కండక్టర్

ఓ ఆర్టీసీ కండక్టర్ కత్తెర పట్టాడు. ఆర్టీసీ స్ట్రైక్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న.. ఈ కండక్టర్.. కుటుంబ పోషణ కోసం కత్తెర పట్టాల్సి వచ్చింది. గత కొద్దిరోజులుగా.. తెలంగాణలో ఆర్టీసీ స్ట్రైక్ కొనసాగుతోంది. మేము తగ్గమంటే.. మేము తగ్గమంటూ.. అటు ఆర్టీసీ కార్మికులు, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎవరికి వారు భీష్మించుకు కూర్చున్నారు. అంతకు ముందు నెల జీతం రాకపోగా.. ప్రస్తుతం సమ్మె కారణంగా.. మరో నెల జీతం కూడా రాలేని పరిస్థితుల్లో.. చేసేది లేక […]

కుల వృత్తికి సాటి ఏది..? కత్తెర పట్టిన ఆర్టీసీ కండక్టర్
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2019 | 12:04 PM

ఓ ఆర్టీసీ కండక్టర్ కత్తెర పట్టాడు. ఆర్టీసీ స్ట్రైక్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న.. ఈ కండక్టర్.. కుటుంబ పోషణ కోసం కత్తెర పట్టాల్సి వచ్చింది. గత కొద్దిరోజులుగా.. తెలంగాణలో ఆర్టీసీ స్ట్రైక్ కొనసాగుతోంది. మేము తగ్గమంటే.. మేము తగ్గమంటూ.. అటు ఆర్టీసీ కార్మికులు, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎవరికి వారు భీష్మించుకు కూర్చున్నారు. అంతకు ముందు నెల జీతం రాకపోగా.. ప్రస్తుతం సమ్మె కారణంగా.. మరో నెల జీతం కూడా రాలేని పరిస్థితుల్లో.. చేసేది లేక కుటుంబ పోషణ కోసం మహీపాల్ అనే ఈ కండక్టర్ తన కులవృత్తిని చేపట్టాడు.

నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లీకి చెందిన మహీపాల్ గతంలో సెలూన్ నిర్వహించేవాడు. అనంతరం 2009లో ఆర్టీసీలో కండక్టర్‌గా ఉద్యోగం రావడంతో.. కులవృత్తిని పక్కకు పెట్టి.. ఆర్టీసీ సిబ్బందిలో ఒక భాగమయ్యాడు. కానీ.. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో యూనియన్లు.. నిరవధిక సమ్మె చేయడంతో.. మహీపాల్.. కండక్టర్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. స్ట్రైక్ కారణంగా రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో.. కుటుంబ పోషణ భారమైంది. దీంతో.. మహీపాల్ మళ్లీ కత్తెర పట్టక తప్పలేదు. అటు సమ్మెలో పాల్గొంటూనే.. ఇటు కుటుంబపోషణ కోసం కులవృత్తి చేస్తున్నాడు.