Rice Millers Cheating: తెలంగాణలో రైతులను దోచుకుంటున్న దళారులు.. సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరకే ధాన్యం కొనుగోళ్లు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరివార్‌..ఢిల్లీ నుంచి గల్లీవరకు ఆందోళనలు.. ఇదే సమయంలో ధాన్యాన్ని తామే కొనుగోలు చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో మళ్లీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే..

Rice Millers Cheating: తెలంగాణలో రైతులను దోచుకుంటున్న దళారులు.. సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరకే ధాన్యం కొనుగోళ్లు
Rice Millers Cheating Telan
Follow us

|

Updated on: Apr 13, 2022 | 1:48 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరివార్‌..ఢిల్లీ నుంచి గల్లీవరకు ఆందోళనలు.. ఇదే సమయంలో ధాన్యాన్ని తామే కొనుగోలు చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో మళ్లీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే ఇన్నాళ్లూ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వాల మధ్య గొడవతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో ఇదే అదునుగా మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి అన్నదాతలను దోచుకున్నారు. మార్కెట్‌ కంటే తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి సీజన్‌లో దాదాపు 10లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 23 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. ఐతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో..దిక్కుతోచని పరిస్థితుల్లో మిల్లర్స్‌ను ఆశ్రయిస్తున్నారు రైతులు. సందట్లో సడేమియాలా మిల్లర్లంతా సిండికేట్‌గా మారి క్వింటాకు 3వందల నుంచి 4వందల రూపాయల వరకు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.

అయితే.. మరో వారంలో పెద్దమొత్తంలో ధాన్యం వచ్చే అవకాశం ఉంది. కానీ ఎగుమతులు లేవనే సాకుతో ధర తగ్గించి కొనుగోళ్లు జరుపుతున్నారని..దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ముందుగానే ధర ఎక్కువ చెల్లిస్తే సీజన్‌ మొత్తం అదే ధర కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్లంతా కుమ్మక్కై సన్నరకం ధాన్యం ధరను అమాంతం తగ్గించారని రైతులు వాపోతున్నారు. ఈ ధరకు పంటను అమ్ముకుంటే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. మిల్లర్లు తమను దోచుకుంటున్నా..అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సన్నరకం సాగుచేసిన రైతులే కష్టాలు పడుతుండగా..ఇక దొడ్డురకం కొనుగోళ్లు మరింత కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో దొడ్డురకం సాగు చేసిన రైతులు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. దొడ్డు రకం ధాన్యాన్ని అటు మిల్లర్లు, ఇటు ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తాయా లేదా అనే సందిగ్ధంలో పడ్డారు.

ఇవి కూడా చదవండి: Pranahita Pushkaralu: ఇవాళ్టి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు.. మధ్యాహ్నం తర్వాత నదిలోకి పుష్కర పురుషుడు..

Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!