Revanth Reddy: ఇలా మాట్లాడితే ఎవరు మాత్రం పడిపోరు..! మహబూబ్‌నగర్‌ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మొహబ్బత్‌ కీ దుకాన్‌

|

Dec 01, 2024 | 7:47 AM

కేకే గారు...మీ అనుభవం అంతా లేదు నా వయసు. సీనియర్‌ మంత్రుల సహకారం లేకుంటే అభివృద్ధి అస్సలు సాధ్యం కాదు. ఇలాంటి మాటలతో అంతా స్టన్ అవ్వడంతోపాటు.. ఫిదా అయిపోయారు. టీ కాంగ్రెస్‌లో రేవంత్‌ నయా మార్క్‌... అందరిచేత చప్పట్లు కొట్టించింది. మహబూబ్‌నగర్‌ సాక్షిగా మొహబ్బత్‌ కీ దుకాన్‌ తెరుచుకుంది.

Revanth Reddy: ఇలా మాట్లాడితే ఎవరు మాత్రం పడిపోరు..! మహబూబ్‌నగర్‌ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మొహబ్బత్‌ కీ దుకాన్‌
CM Revanth Reddy
Follow us on

మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో జరిగిన రైతు పండుగ కార్యక్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్‌ చూపించారు. తన స్పీచ్‌లో సీనియర్లకు ఫుల్‌ మార్క్స్‌ వేశారు. సీనియర్‌ మంత్రులతో పోలిస్తే తాను జూనియర్‌ని అని చెప్పుకుంటూనే, పాలమూరు బిడ్డ సీఎం అవడానికి సీనియర్ల సహకారమే కారణమంటూ వారిని ఆకాశానికి ఎత్తేశారు. వయసులో చిన్నవాడిని అయినా.. మీ ఆశీర్వాదంతో సీఎం కుర్చీ పాలమూరు బిడ్డకు ఇచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనాడు మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేయలేదన్నారు.. అయిప్పటికీ.. సీనియర్లు తనను ఆదరించారంటూ తన మార్క్ ప్రసంగంతో సీఎం అందరిని ఆకట్టుకోవడంతోపాటు.. కాంగ్రెస్ కేడర్ సరికొత్త జోష్ నింపారు..

రైతులకు బోనస్ ప్రకటించిన ఘనత, మంత్రి ఉత్తమ్‌కే దక్కుతుందన్నారు రేవంత్‌ రెడ్డి.. ఆయన మన పాలమూరు అల్లుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రైతు రుణమాఫీ చేయగలిగామంటే అదంతా డిప్యూటీ సీఎం, మంత్రి భట్టి విక్రమార్క చలవేనంటూ రేవంత్‌ రెడ్డి ప్రశంసించారు.

పాలమూరు అంటేనే మల్లు కుటుంబం అంటూ ఎంపీ మల్లు రవి, మంత్రి భట్టి విక్రమార్కలపై ప్రశంసల జల్లు కురిపించారు సీఎం రెవంత్ రెడ్డి..

మంత్రి దామోదర అంటే తనకు ఇష్టం కాబట్టే…జిల్లాకు ఇన్‌చార్జిగా పెట్టుకున్నానంటూ మనసులో మాట బయటపెట్టారు రేవంత్‌ రెడ్డి..

కేకే గారు…మీ అనుభవం అంతా లేదు నా వయసు. సీనియర్‌ మంత్రుల సహకారం లేకుంటే అభివృద్ధి అస్సలు సాధ్యం కాదంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.. మీ చప్పట్లే పాలమూరు అభివృద్ధికి మనం చేసే విజ్ఞప్తి అంటూ.. ప్రజల చేత సీనియర్లకు చప్పట్లు కొట్టించారు రేవంత్‌ రెడ్డి..

సీఎం రేవంత్ రెడ్డి వీడియో చూడండి..

పాలనలో.. అలా సహకరిస్తున్నారంటూ, క్రెడిట్‌ అంతా సీనియర్లకే అప్పగించారు సీఎం రేవంత్‌. టీ కాంగ్రెస్‌ పుస్తకంలో మొహబ్బత్‌ కీ దుకాన్‌ చాప్టర్‌కి శ్రీకారం చుట్టడంతోపాటు.. తనదైన మార్క్‌ ఏంటో చూపించారు సీఎం రేవంత్ రెడ్డి.. ఇలా అయితే.. ఎవరు మాత్రం పడిపోరు.. అంటూ తెలంగాణ కాంగ్రెస్ కేడర్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై చర్చ కొనసాగుతోంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..