Telangana Politics: కాంగ్రెస్ Vs బీజేపీ.. తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్న రేవంత్, దాసోజు ట్విట్ వార్..

విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటోందనీ.. బండి సంజయ్, దాసోజ్ శ్రవణ్ ఆధ్వర్యంలో ఈ కుట్ర జరిగిందనేది రేవంత్ ఆరోపణ. అంతే కాదు ఇదిగో సాక్ష్యం అంటూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.

Telangana Politics: కాంగ్రెస్ Vs బీజేపీ.. తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్న రేవంత్, దాసోజు ట్విట్ వార్..
Revanth Vs Dasoju
Follow us

|

Updated on: Aug 26, 2022 | 9:54 AM

Revanth Reddy Vs Dasoju Sravan: ట్వీట్లు అయినా తిట్లు అయినా.. తెలంగాణ రాజకీయం తర్వాతే..? టార్గెట్ 2023గా ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం వేరే లెవల్‌కి వెళ్తోంది. తాజాగా.. బీజేపీ – కాంగ్రెస్ (Congress Vs BJP) మధ్య అల్లర్లపై ట్వీట్ల యుద్ధం మరింత హీటెక్కిస్తోంది. పక్కా పథకం ప్రకారమే బీజేపీ మత ఘర్షణలు రేపుతోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటోందనీ.. బండి సంజయ్, దాసోజ్ శ్రవణ్ ఆధ్వర్యంలో ఈ కుట్ర జరిగిందనేది రేవంత్ ఆరోపణ. అంతే కాదు ఇదిగో సాక్ష్యం అంటూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.

కాగా.. ఈ వీడియోపై దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎడిట్‌ చేసిన వీడియోతో తమపై విషం కక్కుతున్నారని ఆరోపించారు. అంతే కాదు ఆ వీడియో రియల్ అని నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే మీరేం చేస్తారని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు దాసోజు.

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ సేవలు అందించిన దాసోజు.. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ సందర్భంగా పీసీసీ చీఫ్‌పై తీవ్ర ఆరోపణలు చేసారు. రేవంత్‌రెడ్డి వచ్చే వరకు పార్టీ బాగానే ఉందని, ఆ తర్వాతే భ్రష్టుపట్టిందని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏడాది నుంచి కడుపులో దాచుకుని ఇప్పుడు వెళ్లగక్కాల్సి వచ్చిందని చెప్పారు. రాహుల్‌ చెప్పినా, ఏఐసీసీకి లేఖలు రాసినా మార్పు లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!