Illegal Games: మూడు ముక్కలాటతో క్షణాల్లో కోటిశ్వరాలవ్వాలనుకున్నారు.. కానీ అంతలోనే..

Illegal Games: మూడు ముక్కలాటతో క్షణాల్లో కోటిశ్వరాలవ్వాలన్న అత్యాసతో గుట్టుచప్పుడు కాకుండా ఆట సాగిస్తున్నారు కొందరు జూదరులు.

Illegal Games: మూడు ముక్కలాటతో క్షణాల్లో కోటిశ్వరాలవ్వాలనుకున్నారు.. కానీ అంతలోనే..
Follow us

|

Updated on: Feb 09, 2021 | 9:06 PM

Illegal Games: మూడు ముక్కలాటతో క్షణాల్లో కోటిశ్వరాలవ్వాలన్న అత్యాసతో గుట్టుచప్పుడు కాకుండా ఆట సాగిస్తున్నారు కొందరు జూదరులు. కానీ పోలీసులు ఊరుకుంటారా? విషయం తెలుసుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట ముఠా గుట్టును రట్టు చేశారు. మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో అందర్-బహార్ ఆట ఆడిస్తున్న ఓ ముఠాను టాస్క్ ఫోర్స్ వలపన్ని పట్టుకున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల టాస్క్ పోర్స్ పోలీసులు వేసిన స్కెచ్‌కు ఏకంగా 57 మంది పేకాటరాయుళ్లు చిక్కారు. రాష్ట్ర సరిహద్దులు దాటి యధేచ్చగా ఎంజాయ్ చేస్తున్న పేకాట ప్రియుల ఆటకట్టించారు పోలీసులు.

పూర్తి వివరాల్లోకెళితే.. తెలంగాణ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణకు కి పెద్దపీట వేస్తూ పేకాటపై ఉక్కుపాదాన్ని మోపి అన్ని క్లబ్‌లను అరికట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్‌లు మూతపడ్డాయి. తెలంగాణలో ఆడడం వీలు కాదని తెలుసుకున్న పేక పత్తాల ప్రియులు ఏకంగా ఓ వాట్సాప్ గ్రూపునే ఏర్పాటు చేసుకుని.. రాష్ట్ర సరిహద్దుల్లో అనువైన ప్రాంతాలను ఎంచుకుని మూడు ముక్కలాట జాలీగా ఆడేస్తున్నారు. కాయ్ రాజ్ కాయ్ అంటూ లక్షలు పోగొట్టుకుంటున్నారు. అదృష్టం కలిసొస్తే ఓకే.. దురదృష్టం ఎదురొచ్చిందా ఇక అంతే సంగతులు. అలా వేలు కాదు లక్షలు కాదు కోట్లు పోగొట్టుకుని ఇంటి దారి పడుతున్నారు పేకాట ప్రియులు. మహారాష్ట్రలోని నాందేడ్, చంద్రపూర్ జిల్లాలో యధేచ్చగా సాగుతున్న పేకాట క్లబ్బులకు వెళుతున్న పేకాట రాయుళ్లపై పోకస్ పెట్టిన రామగుండం టాస్క్ పోర్స్ టీం ఓ పేకాఠ ముఠాను వల పన్ని పట్టుకుంది.

అంతఃరాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతున్న పేకాట క్లబ్‌లపై పేకాటరాయుళ్లకు భారీ ఆశలు చూపుతూ పెద్ద నెట్‌వర్క్ ఏర్పాటు చేసింది తెలంగాణకు చెందిన ఓ ముఠా. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు చెందిన అనుగొండ సుదర్శన్, మాదారపు రామారావు, మాదారపు విజయ్, మహేందర్ రావు లపై పోకస్ పెట్టిన రామగుండం కమిషనరేట్ టాస్క్ పోర్స్ పోలీసులు కూపి లాగితే మూడు ముక్కల ప్రియుల డొంకంతా కదిలింది. పేకాట రాయుళ్ళ పేరిట కొన్ని వాట్సప్ గ్రూప్ లు ఏర్పాటు చేసి అందులో సందేశాలు పంపిస్తూ వారికీ పేకాట అడే ప్రాంతాన్ని తెలియజేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు రామగుండం కమిషనరేట్ పోలీసులు. మహారాష్ట్రలోని రాజురా, దర్మాబాద్, జిలోలి, ఏస్గా కుంట, చంద్రపూర్ ప్రాంతాలకు వాహనాలు ఏర్పాటు చేసి పేకాట ప్రియులను తీసుకెళుతున్నారన్న సమాచారంతో నిఘా పెట్టారు. మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట్ జిల్లాలకు చెందిన పేకాటరాయుళ్లు పెద్ద సంఖ్యలో వెళుతున్నట్లు గుర్తించిన టాస్క్ పోర్స్ టీం బెల్లంపల్లి ప్రాంతంలోని తాండూర్ పరిదిలో వలపన్ని పేకాట రాయుళ్ల ముఠాను పట్టుకున్నారు.

ఈ దాడుల్లో కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన 57 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి రూ. 6 లక్షల నగదు, 18 కార్లు, 62 సెల్ పోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడుల్లో పదేపదే అరెస్ట్ అవుతున్నా పేకాట వ్యసనాన్ని మానుకోని జూదరులు.. మరోసారి పట్టుబడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ సత్యనారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పేకాట స్థావరాలను నిర్వహిస్తూ పేకాట రాయుళ్ల చిట్టా సిద్దం చేశామని, వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు.

Also read:

చమోలీ ఘటనకు రేడియో యాక్టివ్ పరికరమే కారణమా ? రైనీ గ్రామస్తుల్లో వెల్లువెత్తుతున్న అనుమానాలు

Have Aliens Found Us: ఏలియన్స్ ఉన్నాయి.. భూమి మీదకు వచ్చాయి, సౌర్య వ్యవస్థపై పరిశోధనలు చేస్తున్నాయంటున్న ప్రొఫెసర్