Photo Morphing: వరంగల్‌లో రెచ్చిపోయిన సైకో.. వ్యక్తిగత కక్షతో తన మేనకోడలి ఫోటోలను..

Photo Morphing: వరంగల్ జిల్లాలో సైకో శంకర్ రెచ్చిపోయాడు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో తన మేన కోడలితో పాటు, ఆమె స్నేహితుల ఫోటోలను అసభ్యంగా

Photo Morphing: వరంగల్‌లో రెచ్చిపోయిన సైకో.. వ్యక్తిగత కక్షతో తన మేనకోడలి ఫోటోలను..
Follow us

|

Updated on: Jan 22, 2021 | 9:08 AM

Photo Morphing: వరంగల్ జిల్లాలో సైకో శంకర్ రెచ్చిపోయాడు. జిల్లాలోని కరీమాబాద్‌కు చెందిన శంకర్.. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో తన మేన కోడలితో పాటు, ఆమె స్నేహితుల ఫోటోలను అసభ్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వాటిని గమనించిన బాధితులు.. కొన్ని రోజుల క్రితం మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఆ సైకో ఇంకా రెచ్చిపోయాడు. మరింత అసభ్యంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి వాట్సప్ స్టేటస్, ఫేస్‌బుక్ ‌లలో అసభ్య ప్రచారం చేశాడు.

ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని బాధితురాలి పెళ్లికి అడ్డుపడాలని సైకో శంకర్ యత్నిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. ఆ సైకో నుండి తమను కాపాడకపోతే ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సైకో శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

Janasena Party: తిరుపతి ఉపపోరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

CM KCR: సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం కేసీఆర్‌.. 10 లక్షల ఎకరాలకు సాగు నీరందించే..