Prashant Kishor: తెలంగాణ కాంగ్రెస్‌లో పీకే ఫీవర్.. అయోమయంలో TPCC నేతలు..

Prashant Kishor - Telangana Congress: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలంగాణలో ఎంట్రీతో కొత్త రచ్చ మొదలైంది. శనివారం, ఆదివారం ప్రశాంత్ కిశోర్.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) తో వరుస భేటీలు మరింత కాకపుట్టిస్తున్నాయి.

Prashant Kishor: తెలంగాణ కాంగ్రెస్‌లో పీకే ఫీవర్.. అయోమయంలో TPCC నేతలు..
Prashant Kishor
Follow us

|

Updated on: Apr 25, 2022 | 11:59 AM

Prashant Kishor – Telangana Congress: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలంగాణలో ఎంట్రీతో కొత్త రచ్చ మొదలైంది. శనివారం, ఆదివారం ప్రశాంత్ కిశోర్.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) తో వరుస భేటీలు మరింత కాకపుట్టిస్తున్నాయి. ఈ తరుణంలో దేశ రాజకీయాల్లో మారుతున్న పరిణామాణాలతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ ముందుకెళ్లే అంశంపై టీపీసీసీ నేతలు సమాలోచనలో పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) ఇటీవల ఏఐసీసీ నేతలతో వరుసగా చర్చలు నిర్వహించారు. సోనియా గాంధీతో వరుసగా సమావేశమవుతూనే.. మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం తెలంగాణ కాంగ్రెస్‌లో అయోమయ పరిస్థితికి దారితీసింది. ఇటు కాంగ్రెస్‌తో జట్టు కడుతూనే.. సీఎం కేసీఆర్‌తో రాజకీయ ఒప్పందం కుదుర్చుకోవడం ప్రస్తుతం టీపీసీసీ నేతలను ఇరకాటంలో పడేసినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పీకే టీఆర్ఎస్ కోసం పనిచేస్తే.. అది కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. దీంతోపాటు వచ్చే నెల 6, 7 తేదీల్లో రాహుల్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పరిస్థితుల్లో టీపీసీసీ వర్గాల్లో గందరగోళ పరిస్థితి నెలకొనడంపై పలువురు పార్టీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నట్లు సమాచారం…

ఈ తరుణంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ వరుస ట్వీట్లు చేశారు. TRSతో పీకే టీమ్‌ కలిసి పనిచేయడంపై పరోక్ష వ్యాఖ్యలు సంధించారు. నీ శత్రువుతో స్నేహంగా ఉండే వ్యక్తులను.. నమ్మొద్దనే కొటేషన్‌ను మాణిక్కం ఠాగూర్ ట్వీట్‌ చేశారు. చిట్టచివరి అవకాశాన్ని, ఆశను వదులుకోనంటూ.. గాంధీ వ్యాఖ్యలను జోడించారు. కాగా.. మాణిక్కం ఠాగూర్‌ వరుస ట్వీట్లపై ఏఐసీసీలో చర్చ మొదలైంది. అయితే.. దీనిపై ఇప్పుడే తొందరపడవద్దని.. రెండు మూడు రోజుల్లో అధిష్టానం స్పందిస్తుందంటూ టీపీసీసీ నేతలకు ఏఐసీసీ నేత ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా.. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా.. లేదంటే పార్టీతో కలిసి పనిచేస్తారా.. అనే దానిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఇది అధిష్టానం పరిధిలోని అంశమన్నారు. రాహుల్, సోనియా గాంధీ ఎలా ఆదేశిస్తే అలానే ముందుకు వెళ్తామన్నారు.

Also Read:

MIM: టార్గెట్ 2024.. ఆ నియోజకవర్గాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ నజర్.. కార్యకర్తలతో భేటీ

T.Congress: కలహాల కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు.. రేవంత్‌కు వ్యతిరేకంగా మరోవర్గం కొత్త రాగం..

అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..