Bandi Sanjay: భైంసాలో పాదయాత్రకు పర్మిషన్‌ ఇవ్వని పోలీసులు.. కరీంనగర్ నుంచి భైంసా బయల్దేరిన బండి సంజయ్..

భైంసాలో బండి సంజయ్‌ పాదయాత్రతో పాటు సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సున్నితమైన ప్రాంతం కావడంతో భద్రత ఇవ్వలేమని బీజేపీకి తేల్చి చెప్పారు. అయితే..

Bandi Sanjay: భైంసాలో పాదయాత్రకు పర్మిషన్‌ ఇవ్వని పోలీసులు.. కరీంనగర్ నుంచి భైంసా బయల్దేరిన బండి సంజయ్..
Bandi Sanjay Padayatra
Follow us

|

Updated on: Nov 27, 2022 | 9:11 PM

నిర్మల్ జిల్లా భైంసాలో రేపు బండి సంజయ్‌ తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రకు పోలీసులు పర్మిషన్‌ ఇవ్వకపోవడం ఉద్రిక్తలకు దారితీసింది. సున్నితమైన ప్రాంతంలో పాదయాత్రకు, బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేమని చెప్పారు పోలీసులు. దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. నిర్మల్‌ జిల్లా ఎస్పీ ఆఫీస్‌ ముందు ఆందోళనకు దిగుతున్నారు. బండి సంజయ్‌ కూడా కరీంనగర్‌ నుంచి నిర్మల్‌ బయల్దేరారు. ఆయన్ను కోరుట్ల దగ్గర వెంకటాపూర్‌లో అడ్డుకున్నారు పోలీసులు. వెనక్కి వెళ్లిపోవాలంటూ కోరారు. అందుకు బండి సంజయ్‌ నిరాకరించారు. ఈ సందర్భంగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కారు నుంచి దిగలేదు.

భైంసాలో సభ నిర్వహించడంలో తగ్గేదే లేదంటున్నారు బీజేపీ నాయకులు. అదేమైన నిషేధిత ప్రాంతమా అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. పోలీసులపై, ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ. అయితే.. ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమంటూ బీజేపీ నాయకులు మండి పడుతున్నారు. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా బండి సంజయ్‌ జరిగి తీరుతుందని స్పష్టంచేస్తున్నారు.

సోమవారం నుంచి బండి సంజయ్ ప్రారంభం కానుంది. ఈ యాత్ర ప్రారంభం ముందు నిర్వహించే సభలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొననున్నారు. ఐదో విడత పాదయాత్రలో భాగంగా భైంసా నుంచి కరీంనగర్ వరకు యాత్ర సాగనుంది. 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 17వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం