హైదరాబాద్ జగద్గిరిగుట్టలో కార్డన్ సెర్చ్

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో కార్డన్ సెర్చ్

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో 200 మంది పోలీసులు ఇళ్లల్లో తనిఖీలు జరిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నగరమంతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాలనీల్లో అనుమానితులు ఉన్నట్లు సమాచారంతోనే ఈ సోదాలు నిర్వహించామన్నారు డీసీపీ పద్మజ. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 48 బైకులు, 4 ఆటోలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంఘవిద్రోహులు నగరంలో తిష్టవేస్తారన్న అనుమానంతోనే.. పటిష్ట […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 28, 2019 | 10:14 AM

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో 200 మంది పోలీసులు ఇళ్లల్లో తనిఖీలు జరిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నగరమంతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాలనీల్లో అనుమానితులు ఉన్నట్లు సమాచారంతోనే ఈ సోదాలు నిర్వహించామన్నారు డీసీపీ పద్మజ. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 48 బైకులు, 4 ఆటోలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంఘవిద్రోహులు నగరంలో తిష్టవేస్తారన్న అనుమానంతోనే.. పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు పోలీసులు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu