Telangana: రాత్రి పూట గొర్రెలు మేపుతుండగా కాపరులకు వినిపించిన పెద్ద శబ్ధం.. ఏంటా అని వెళ్లి చూడగా షాక్

సహజ సంపదను దోచేస్తున్నారు కేటుగాళ్లు. ప్రజాప్రతినిధుల అండతో రెచ్చిపోతున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే కల్లబొల్లి కబుర్లు చెబుతూ తప్పించుకుంటున్నారు.

Telangana: రాత్రి పూట గొర్రెలు మేపుతుండగా కాపరులకు వినిపించిన పెద్ద శబ్ధం.. ఏంటా అని వెళ్లి చూడగా షాక్
Shepherd (A representative image)
Follow us

|

Updated on: Aug 01, 2022 | 8:05 AM

రంగురాళ్లు గురించి మీకు తెలుసా..? డిఫరెంట్ కలర్స్‌లో ఉండే స్టోన్స్ అని లైట్ తీసుకోకండి. అవి లక్షలు తెచ్చిపెడతాయి.  అందుకే రంగురాళ్ల కోసం తెలుగు రాష్ట్రాల్లోని(Telugu states) చాలా ప్రాంతాల్లో ముఠాలు రహస్యంగా తవ్వకాలు జరుపుతూ ఉంటాయి. గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది లక్షలు పోగేసుకుంటున్నారు. వీటి కోసం ఏకంగా జేసీబీలనే రంగంలోకి దించుతున్నారంటే నెట్‌వర్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కామారెడ్డి జిల్లా(Kamareddy district) భిక్కనూర్(Bhiknoor)మండల కేంద్రంలోని సిద్ధరామేశ్వర ఆలయ సమీపంలో(Sri Siddarameshwara Swamy Temple-Bhiknoor) రంగురాళ్ల కోసం తవ్వకాలు జరిపిన ఘటన వెలుగుచూసింది. సిద్ధరామేశ్వర ఆలయ సమీపంలో అర్ధరాత్రి సమయంలో రంగురాళ్లు తవ్వుతుండగా జేసీబీ పొక్లేయిన్ బురదలో కూరుకుపోయింది. ఈ క్రమంలో దాన్ని బయటకు తీసే సమయంలో పెద్ద శబ్ధం వచ్చింది. ఆ పక్కనే ఉన్న గొర్రెల కాపర్లు అనుమానంతో అక్కడికి వచ్చి ఆ సెటప్ అంతా చూసి కంగుతిన్నారు. ఏం జరుగుతుందని ప్రశ్నించారు. అవతలి వారి నుంచి పొంతనలేని సమాధానలు వచ్చాయి. దీంతో గొర్రెల కాపరులు వెంటనే పోలీసులకు కాల్ చేశారు. వెంటనే అక్కడికి చేరకున్న కాప్స్.. ప్రొక్లెయిన్‌తో పాటు రంగురాళ్లను స్వాధీనం చేసుకుని భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  హైదరాబాద్ కు చెందిన ఓ ప్రజా ప్రతినిధి, స్థానిక ప్రజా ప్రతినిధి అండతోనే రంగురాళ్లు తవ్వకాలు జరుపుతున్నట్లు స్థానికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖద్దర్ ప్రమేయం ఉంది అంటేనే తెలుస్తుంది.. ఈ దందా చేస్తే ఎంత పైసా వస్తుందో. సహజ సంపదు దోచేస్తున్న ఇలాంటి ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..