CM KCR: దేశ్ కి నేత.. కిసాన్ కి భరోసా.. జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ సీఎం కేసీఆర్ సైకత శిల్పం..

దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ జగన్నాథుడు కొలువుతీరిన పూరీ పవిత్ర నగరంలో

CM KCR: దేశ్ కి నేత.. కిసాన్ కి భరోసా.. జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ సీఎం కేసీఆర్ సైకత శిల్పం..
CM KCR Sand Art
Follow us

|

Updated on: Oct 03, 2022 | 6:38 PM

దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ జగన్నాథుడు కొలువుతీరిన పూరీ పవిత్ర నగరంలో కేసీఆర్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్ కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సైకత శిల్పి సాహు చేత కేసీఆర్ సైకత శిల్పాన్ని రూపొందింపజేశారు. 14 ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటంతో తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణను దేశానికే మార్గదర్శిగా తీర్చిదిద్దారని అరవింద్ అన్నారు. అదే తరహాలో దేశ భవిష్యత్తును సైతం మార్చగల సత్తా కలిగిన మహోన్నత నేత కేసీఆర్ కు ఉందని కొనియాడారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన ఇప్పటికీ రైతులు, పలు వర్గాలు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

కాంగ్రెస్, బిజెపిల పాలన వైఫల్యమైననని గుర్తించిన కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధపడ్డారని అన్నారు. యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్న వేళ.. దేశ గతిని సైతం మార్చేందుకు నడుం బిగించిన తమ నాయకుడికి వినూత్న రీతిలో ఆహ్వానం పలికేందుకే సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించినట్లు అరవింద్ తెలిపారు. అద్భుతంగా తీర్చిదిన శిల్పాన్ని వీక్షించేందుకు పూరీలోని స్థానికులు పర్యాటకులు ఆసక్తి కనబరిచారు. భవిష్యత్తు నాయకుడు అంటూ ఫోటోలు తీసుకుని సామాజిక మాధ్యమాలలో పోస్ట్లు పెట్టుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అరవింద్ అన్నారు.

కాగా.. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సైకత శిల్పాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు, పర్యటకులు ఆసక్తి చూపారు. ఫోటోలు, వీడియోలు తీస్తూ సందడి చేశారు.

ఇవి కూడా చదవండి
Cm Kcr Sand Art

Cm Kcr Sand Art

కాగా.. దసరా రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నారు. పార్టీ పేరుతోపాటు జెండా, పార్టీ లక్ష్యం పలు విషయాల గురించి సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా వివరించారు. దీని గురించి ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు నాయకులతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. బుధవారం ఎలాంటి ప్రకటన చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!