సింగరేణిలో ముందుగానే దసరా సంబరాలు

మంచిర్యాల సింగరేణిలో కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనతో సింగరేణి వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. సింగరేణి సంస్థ 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చిన లాభాల్లో 28శాతం వాటాను కార్మికులకు చెల్లించనున్నట్లు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. రూ.1765కోట్ల లాభాలు రాగా అందులో 28శాతం వాటా లాభాల కింద ప్రతీ కార్మికునికి చెల్లించనున్నట్లు, తద్వారా ప్రతీ కార్మికుడు రూ.1,00,899లను పొందనున్నట్లు ఆయన […]

సింగరేణిలో ముందుగానే దసరా సంబరాలు
Follow us

|

Updated on: Sep 19, 2019 | 8:11 PM

మంచిర్యాల సింగరేణిలో కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనతో సింగరేణి వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. సింగరేణి సంస్థ 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చిన లాభాల్లో 28శాతం వాటాను కార్మికులకు చెల్లించనున్నట్లు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. రూ.1765కోట్ల లాభాలు రాగా అందులో 28శాతం వాటా లాభాల కింద ప్రతీ కార్మికునికి చెల్లించనున్నట్లు, తద్వారా ప్రతీ కార్మికుడు రూ.1,00,899లను పొందనున్నట్లు ఆయన తెలిపారు. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని సింగరేణి కార్మికులకు దసరా కానుక కింద ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరం నుండి మొదలుకొని గత ఐదు సంవత్సరాలుగా సింగరణి సంస్థ లాభాలు గడిస్తుందని తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో బోనస్‌ కింద రూ.13,500 చెల్లించగా, ప్రతీ సంవత్సరం వాటా పెంచడంతో పాటు లాభాలు కూడా పెరుగుతుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం వరకు సింగరేణి కార్మికులు రూ.1లక్ష వరకు లాభాల కింద వాటా పొందుతున్నారని, అదేవిధంగా 2013-14 ఆర్థిక సంవత్సరం నుండి బొగ్గు ఉత్పత్తిలో కూడా ఘనణీయంగా ఉత్పత్తి సాధించిందని తెలిపారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన సీఎం ప్రకటనతో సింగరేణి అంతటా కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..