ఆ ఇంటికి ఏమైంది..? ఒకరి తర్వాత ఒకరుగా ఎనిమిది మరణాలు..

ఆ కుటుంబాన్ని విషాద సంద్రం ముంచెత్తింది. విధి ఆడిన వింత నాటకంలో ఒక్కొక్కరుగా మృత్యువుకు బలైపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా తొమ్మిది మంది చనిపోయారు. దీంతో ఆ కుటుంబంలోని కన్నీటి పడవని ఆపే నాథుడే కరువైపోయాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఓ కుటుంబంలో ఒక్కొక్కరుగా మొత్తం తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని శాస్త్రినగర్‌కు చెందిన షేక్ ఖరీం, రహిమున్నీసాబేగం దంపతులకు ఎనిమిది మంది సంతానం. పెద్ద కుమారుడు వకీల్‌ […]

ఆ ఇంటికి ఏమైంది..? ఒకరి తర్వాత ఒకరుగా ఎనిమిది మరణాలు..
Follow us

|

Updated on: Dec 24, 2019 | 5:09 PM

ఆ కుటుంబాన్ని విషాద సంద్రం ముంచెత్తింది. విధి ఆడిన వింత నాటకంలో ఒక్కొక్కరుగా మృత్యువుకు బలైపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా తొమ్మిది మంది చనిపోయారు. దీంతో ఆ కుటుంబంలోని కన్నీటి పడవని ఆపే నాథుడే కరువైపోయాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఓ కుటుంబంలో ఒక్కొక్కరుగా మొత్తం తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని శాస్త్రినగర్‌కు చెందిన షేక్ ఖరీం, రహిమున్నీసాబేగం దంపతులకు ఎనిమిది మంది సంతానం. పెద్ద కుమారుడు వకీల్‌ పుట్టిన మూడేళ్లకే మూర్చ వ్యాధితో మృతిచెందాడు. అప్పటి నుంచి వీరి కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతూనే ఉంది. పన్నెండేళ్ల క్రితం రహిమున్నీసా భర్త షేక్ ఖరీం ఊపిరితిత్తులు దెబ్బతిని మృతి చెందాడు. మూడో కుమారుడు ఇర్ఫాన్‌ ఊపిరితిత్తుల వ్యాధితో తొమ్మిదేళ్ల కింద చనిపోయాడు. రెండో కుమారుడు షేక్‌ ఇమ్రాన్‌కు ఆటో ప్రమాదంలో తీవ్ర గాయాలతో మంచానికే పరిమితమై… ఆరేళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయాడు.

ఇమ్రాన్‌కు ఇద్దరు పిల్లలు కాగా…. కుమారుడు పుట్టిన పన్నెండు రోజులకే చనిపోయాడు. ముగ్గురు కుమారులు, భర్త, మనవడిని బలి తీసుకున్న మృత్యువు.. అంతటితో వదిలిపెట్టలేదు. ఆ తర్వాత మరో ముగ్గురు కుమారుల్ని తీసుకెళ్లిపోయింది. ఆరో కొడుకు ముబీన్ ఆటోను కడిగే క్రమంలో గుండ్ల చెరువులో పడి మృత్యువాత పడ్డాడు. ఆ తర్వాత నాలుగో కుమారుడు షేక్ ఇజాజ్… 15 నెలల కింద గుండెపోటుతో చనిపోయాడు. ఐదో కుమారుడు ముజాహిద్ ఇటీవల డిచ్‌పల్లి మండలం సాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కోళ్లను తీసుకొచ్చేందుకు డీసీఎంలో వెళ్తుండగా… రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆదివారం రహిమున్నీసా బేగం తల్లి రషీదా బేగం కూడా మరణించింది.

ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఆ కుటుంబంలో మొత్తం ఎనిమిది చనిపోయారు. ఇద్దరు కుమారులు ఆటో కారణంగా చనిపోవడంతో దాన్ని మూలన పడేసినా…. చావులు మాత్రం ఆగడంలేదు. ఇటీవల కురిసిన వర్షానికి ఇల్లు పైకప్పు కూలిపోయింది. మరమ్మతు చేసేందుకు డబ్బుల్లేక… అచ్చిరాలేదన్న మరో ఉద్దేశంతో ఇల్లు మారిపోయారు. అలాగైనా మరణాలు ఆగుతాయని భావించినా… మృత్యువు వదిలి పెట్టలేదు. తల్లి మరణంతో రహీమున్నీసా కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇంతకాలం తనకు తల్లే అన్ని రకాలుగా ధైర్యానిచ్చిందని, ఇప్పుడు అమ్మ మరణం తనను మరింతగా కుంగదీసిందంటూ కన్నీటి పర్యంతమైంది.

మొత్తం 24 ఏళ్లలో తొమ్మిది మంది ఆ కుటుంబంలో మృత్యువాత పడాగా.. గత 12 ఏళ్లలో ఏడుగురు చనిపోయారు. గడిచిన రెండున్నరేళ్లలోనే నలుగురిని మృత్యువు బలి తీసుకుంది. రహిమున్నీసాకు ఇద్దరు కుమారులు మిగిలారు. జావిద్ ఆర్మూర్ లోనే ఓ దుకాణంలో పని చేస్తుండగా.. సాజిద్ చెప్పుల దుకాణంలో పని చేస్తున్నాడు. అయితే, తాను మైనర్‌ కావడంతో ఎక్కడ పనిచేసినా కూడా తనను అధికారులు అడ్డుకుంటున్నారని, ఇంట్లో పరిస్థితి కారణంగా తను పనిచేయక తప్పదని సాజిద్‌ వాపోతున్నాడు. దాతలెవరైనా తమకు సాయం చేయాలని వేడుకుంటున్నారు.