NIA Raids: బయటపడిన మావోయిస్టులతో లింకులు.. హైదరాబాద్‌లో ముగ్గురిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు

Nursing Student: ఇంతకీ రాధ ఎవరు? కేంద్రం హోంశాఖ ఆదేశాలతో ఎన్‌ఐఏ ఆగమేఘాల మీద రంగంలో దిగడం వెనుక కారణాలేంటి?మిస్సింగ్‌ కేసులో మావోయిస్టు లింకులపై ఆరా!

NIA Raids: బయటపడిన మావోయిస్టులతో లింకులు.. హైదరాబాద్‌లో ముగ్గురిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు
Nia
Follow us

|

Updated on: Jun 23, 2022 | 9:20 PM

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌) నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్పను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఆమె జాడ కోసం NIA ఆకస్మిక తనిఖీలపర్వం. ఒక రాధ కోసం ఢిల్లీ టు విశాఖ వయా హైదరాబాద్‌ ఎన్‌ఐఏ సెర్చ్‌ ఆపరేషన్స్‌. ఎన్‌ఐఏ రంగంలోకి దిగిందంటే బాత్‌ బహుత్‌ గంభీర్‌ అన్నమాటే. ఇంతకీ రాధ ఎవరు? కేంద్రం హోంశాఖ ఆదేశాలతో ఎన్‌ఐఏ ఆగమేఘాల మీద రంగంలో దిగడం వెనుక కారణాలేంటి? మిస్సింగ్‌ కేసులో మావోయిస్టు లింకులపై ఆరా!.. ఎన్‌ఐఏ మిషన్‌ రాధ.. వైడ్‌ యాంగిల్‌ ఇదేనా? రాధ.. నర్సింగ్‌ స్టూడెంట్‌. 2017 డిసెంబర్‌ నుంచి రాధ కన్పించుటలేదు. ఆమె జాడ కోసం పేరెంట్స్‌ ఐదేళ్లుగా అన్వేషిస్తున్నారు. రాధ తల్లిదండ్రులు స్వస్థలం ఉత్తరాంధ్ర. ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చారు. మేడ్చల్‌ పరిధిలోని కాప్రాలో ఉంటున్నారు. 2017లో రాధ మిస్సింగ్‌..2022లో చిలకానగర్‌..పిర్జాదిగూడ..చేగుంటలో ఎన్‌ఐఏ తనిఖీలు. రెండింటికి లింకేంటి?

రాధను మావోయిస్టుల్లో చేర్పించారనే అభియోగాల క్రమంలో చిలకానగర్‌లో అడ్వోకేట్‌ శిల్పను..పిర్జాదిగూడలో దేవేంద్రను అదుపులోకి తీసుకున్నాయి ఎన్‌ఐఏ టీమ్స్‌. విచారణకోసం వాళ్లను మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు. సరళ యదార్ధగాధను తెరకెక్కిస్తే విరాటపర్వం. మరి ఎన్‌ఏఐ తనిఖీల పర్వంలో ఎలాంటి విషయాలు తెరపైకి రానున్నాయి. ఇంతకీ రాధ ఎక్కడ? ఓవైపు బిడ్డ కోసం కన్నవాళ్ల ఆందోళన..మరోవైపు ఏకంగా ఎన్‌ఐఏ రంగంలోకి దిగడం అడవిలో అలజడికి సంతకేమా?

చిలకానగర్‌, ఫిర్జాదిగూడ, చేగుంటలో ఎన్‌ఐఏ టీమ్స్‌ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.నర్సింగ్‌స్టూడెంట్‌ రాధ మిస్సింగ్‌ కేసు విచారణలో బాగంగానే ఈ తనిఖీలు. 2017 రాధ కన్పించకుండా పోయినప్పటి నుంచి పేరెంట్స్‌ ఆమె అచూకీ కోసం అంతటా గాలించారు.అడవుల్ని జల్లెడ పట్టారు. పోలీసులను ఆశ్రయించారు. కానీ ఆమె జాడ దొరకలేదు. రాధను కిడ్నాప్‌ చేసి మావోయిస్టుల్లో చేర్పించారంటూ ఈ ఏడాది జనవరి 2న విశాఖలోని పెదబయలు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వారి కంప్లేంట్‌ ఆధారంగా మావోయిస్టులు నేతలు ఉదయ్‌,అరుణ సహా చైతన్య మహిళా సంఘం..CMS ప్రతినిధులు అడ్వోకేట్‌ శిల్ప, దేవేంద్ర,దుబాసీ స్వప్న ఎఫ్‌ఐ ఆర్‌ నమోదయింది.

ఇవి కూడా చదవండి

కేంద్ర హోంశాఖ ఆదేశాలతో రాద మిస్సింగ్‌ కేసును ఇటీవలే ఎన్‌ఐఏ టేకప్‌ చేసింది. వైద్యం మిషతో నర్సింగ్‌ స్టూడెంట్ రాధను శిల్పా, దేవేంద్ర,దుబాసీ స్వప్ప తీసుకెళ్లి మావోయిస్టుల్లో చేర్పించారన్న పేరెంట్స్‌ అభియోగాలు,విశాఖలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఆ ముగ్గరి ఇళ్లలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.

2017లో నమోదైన మిస్సింగ్‌ కేసుపై ఇప్పుడు ఎన్‌ఐఏ విచారణ ఆదేశించడం ఏంటన్నాన్నారు శిల్పా భర్త బండి కిరణ్‌. రాధ మిస్సింగ్‌ కేసుకు శిల్పకు ఎలాంటి సంబంధం లేదన్నారాయన. ఐనా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.

సరిగ్గా ఇదే టైమ్‌లో మెదక్‌ జిల్లా చేగుంట దుబాసి దేవేందర్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు ఎన్‌ఐఏ అధికారులు. దేవేందర్‌ మావోయిస్టు అగ్రనేత దుబాసి శంకర్‌ కుమారుడు. గత ఏడాది నవంబర్‌లో కూడా దేవేందర్‌ ఇంట్లో సెర్చ్‌ జరిగింది. ప్రస్తుతం రాధా మిస్సింగ్‌ కేసులో దుబాసీ స్వప్న పై కేసు నమోదైన క్రమంలోనే తాజా తనిఖీలు.

ఇక పిర్జాదిగూడలోని అడ్వోకేట్‌ దేవేంద్ర ఇంట్లో సోదాలు జరిపి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఎన్‌ఐఏ అధికారులు. అడ్వోకేట్‌ దేవేంద్ర.. మావోయిస్టు ప్రభాకర్‌ భార్య. ప్రభాకర్‌ ఆరేళ్ల కిందట ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. దేవేంద్ర గతంలో చైతన్య మహిళా సంఘంలో కీలకంగా వ్యవహరించారు.

నర్సింగ్ స్టూడెంట్‌ రాధ పేరెంట్స్‌ ఫిర్యాదు మేరకు కిడ్నాప్, అక్రమ నిర్బంధం, చట్టవిరుద్ధంగా సమావేశం, అల్లర్లు, నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఇప్పుడు ఎన్‌ఐఏ కేసును టేకప్‌ చేసింది. హైకోర్టు అడ్వోకేట్‌ శిల్ప, మరో న్యాయవాది దేవేంద్రలను అదుపులోకి తీసుకున్నారు. రాధా మిస్సింగ్‌ కేసుకు సంబంధించి మాదాపూర్‌ ఎన్‌ఐఏ ఆఫీసులో వారిని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ వార్తల కోసం..