Viral: బాబోయ్.! వీళ్లు లవర్స్ కాదు భయ్యో.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే..

| Edited By: Ravi Kiran

Jan 14, 2024 | 10:46 AM

నల్లగొండ జిల్లాలో చైన్ స్నాచింగ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ మహిళ మెడలో బంగారు గొలుసు దొంగలించి.. పరారవుతున్న యువ జంటను కొందరు ఛేజ్ చేసి పట్టుకునేందుకు ప్రయత్నించగా జెట్ స్పీడ్‌తో స్కూటీపై పరారయ్యారు. కట్ చేస్తే.. వాళ్లు లవర్స్ కాదు భయ్యో..! పోలీసుల విచారణలో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది.

Viral: బాబోయ్.! వీళ్లు లవర్స్ కాదు భయ్యో.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే..
Viral News
Follow us on

నల్లగొండ జిల్లాలో చైన్ స్నాచింగ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ మహిళ మెడలో బంగారు గొలుసు దొంగలించి.. పరారవుతున్న యువ జంటను కొందరు ఛేజ్ చేసి పట్టుకునేందుకు ప్రయత్నించగా జెట్ స్పీడ్‌తో స్కూటీపై పరారయ్యారు. చివరికి పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న యువ జంట పోలీసులకు ఎలా చిక్కారంటే.?

వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా మర్రిగూడ సమీపంలో ఈ యువ జంట.. సునీత అనే మహిళను లిఫ్ట్ పేరుతో కొద్ది దూరం స్కూటీపై ఎక్కించుకుని వెళ్లారు. సునీత మెడలో ఉన్న ఏడు తులాల మంగళసూత్రాన్ని లాక్కుని పారిపోయారు. సునీత కేకలు వేయడంతో స్థానికులు కొందరు వీరిని ఛేజ్ చేసి పట్టుకునేందుకు ప్రయత్నించగా.. జెట్ స్పీడ్‌లో స్కూటీపై పరారయ్యారు. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. నిందితులను పట్టుకునేందుకు మూడు పోలీసు బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. బైక్ నెంబర్ సాయంతో.. ఫోన్ నెంబర్‌ను తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేసింది లవర్స్ కాదని.. నిందితులిద్దరూ భార్యభర్తలని గుర్తించారు.

యువ జంట కాదు.. నిందితులిద్దరు భార్యభర్తలే..!

హైదరాబాద్‌లోని సరళ దేవినగర్‌కు చెందిన వెంకటేశ్, కుమారిలను యువ దంపతులుగా పోలీసులు గుర్తించారు. దొంగతనం చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు రూపంలోకి చైన్ స్నాచర్లు మార్చుకున్నట్లు విచారణలో తేలింది. జల్సాలకు అలవాటుపడిన వీరు.. ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. గతంలో ఎక్కడైనా దొంగతనాలు చేశారా.? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..