పులిని పట్టుకునేందుకు ఆవును ఎరగా వేయడంపై భగ్గుమన్న రాజాసింగ్.. ఇదేం పద్దతని అటవీ శాఖపై ఫైర్

పులులను బందించేందుకు ఆవులను ఎరగా వేయడంపై గో రక్షణ సమితి, ఆదివాసీ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పటికే పశువులపై యధేచ్చగా దాడులు చేస్తున్న పులులతో పెద్ద మొత్తంలో నష్టం వాటిళ్లుతుందని.‌‌.

పులిని పట్టుకునేందుకు ఆవును ఎరగా వేయడంపై భగ్గుమన్న రాజాసింగ్.. ఇదేం పద్దతని అటవీ శాఖపై ఫైర్
Follow us

|

Updated on: Jan 12, 2021 | 4:37 PM

పులులను బందించేందుకు ఆవులను ఎరగా వేయడంపై గో రక్షణ సమితి, ఆదివాసీ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పటికే పశువులపై యధేచ్చగా దాడులు చేస్తున్న పులులతో పెద్ద మొత్తంలో నష్టం వాటిళ్లుతుందని.‌‌. నివారణ చర్యలు చేపట్టాల్సింది పోయి పులికి ఆవును ఎరగా వేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీని వాడి పులులను పట్టుకోవాల్సింది పోయి బోన్లు, కెమెరాలంటూ పాత పద్దతుల పేరిట నెలల తరబడి కాలయాపన చేస్తున్నారని ఫైరవుతున్నారు. రెండు నెలల వ్యవదిలో పులి దాడుల్లో 100 కు పైగా పశువులు హతమయ్యాయని.. నష్టపరిహారిహారం ఇస్తామని చెపుతున్న అటవీ శాఖ ప్రాణాలు తెచ్చివ్వగలదా…? అని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు పులికి ఆవును ఎరగా వేయడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. పులిని పట్టుకునేందుకు ఆవులను బలి చేస్తామంటే ఊరుకునేది లేదని అటవీ శాఖకు వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారుతుంది. పులిని పట్టుకునేందుకు గోమాతను ఎరగా వేయడంపై ఆదివాసీలను నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొమురంభీం జిల్లా బెజ్జూరు మండలం కందిభీమన్న అటవి ప్రాంతంలో పులికి ఎరగా వేసిన ఆవు చనిపోయినట్టు సమాచారం అందుతుండటంతో ఆందోళన మరింత పెరిగింది. ఆవు చనిపోయిన విషయం బయటకి పొక్కకుండా అటవీ శాఖ జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.

Also Read:

AP SEC vs AP Government: ఎన్నికల కమిషన్ సెక్రటరీ పోస్ట్ నుంచి వాణీమోహన్‌ను తొలగిస్తూ ఎస్‌ఈసీ ఉత్తర్వులు

Family Suicide: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం.. ఏడాదిన్నర బాలుడు సహా దంపతులు బలవన్మరణం