Minister KTR: విశ్వనగరంగా హైదరాబాద్‌..త్వరలోనే పూర్తికానున్న ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు పనులు.. అసెంబ్లీలో స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. రోడ్ల అభివృద్దికి 5వేల 9వందల కోట్ల రుణం తీసుకున్నామని అసెంబ్లీలో ప్రకటించారు.

Minister KTR: విశ్వనగరంగా హైదరాబాద్‌..త్వరలోనే పూర్తికానున్న ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు పనులు.. అసెంబ్లీలో స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్
Minister Ktr In Assembly
Follow us

|

Updated on: Sep 27, 2021 | 1:59 PM

హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. రోడ్ల అభివృద్దికి 5వేల 9వందల కోట్ల రుణం తీసుకున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఎస్‌ఆర్‌డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ రోడ్ల అభివృద్ధిపై అసెంబ్లీలో స్వల్ప చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ప్రోగ్రాం చేపట్టిన ప్రణాళికా బద్దంగా చేపడుతుందన్నారు. మూడేళ్ల పాటు ట్రాఫిక్‌పై చర్చించిన తర్వాతనే ఎస్‌ఆర్‌డీపీని అమలు చేస్తున్నామని అన్నారు.

హైదరాబాద్‌లో మోతాదుకు మించి ఉన్న వాహనాలతో ట్రాఫిక్‌ పెద్ద సమస్యగా మారిందన్నారు. మొదటి దశ ఎస్‌ఆర్‌డీపీలో 2వేల కోట్లతో 22 ఫ్లైఓవర్లను పూర్తి చేశామని తెలిపారు. గ్రేటర్‌ శివారు ప్రాంతలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఒక్క ఎల్‌బీ నగర్‌లోనే 850 కోట్లతో నాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఖర్చు చేసే ప్రతీ రూపాయి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమేనన్న మంత్రి.. హైదరాబాద్‌లోని ప్రతి లొకేషన్‌కి ఫ్లైఓవర్‌-లింక్‌ రోడ్‌తో అనుసంధానం ఉందన్నారు.

చార్మినార్‌, సౌత్‌ జోన్ల పరిధిల్లో 1545కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి కేటీఆర్‌. పాత బస్తీలో త్వరలోనే పై వంతెన పనులు ప్రారంభిస్తామన్నారు. ఉత్పాదక రంగంలో వెచ్చించే ప్రతి రూపాయి భవిష్యత్తు పెట్టుబడిగానే చూడాలన్నారు. కొత్త రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తు చేశారు. భవిష్యత్‌లో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని వివరించారు. ఎస్‌ఆర్‌డీపీ రెండో దశ ప్రణాళికలు పూర్తయ్యాయని తెలిపారు.

ఇవీ కూడా చదవండి: Aadhar Number: ఆధార్‌ నంబర్ మార్చడం కుదరదు.. మారిస్తే అనేక చిక్కులు.. కీలక ప్రకటన చేసిన ఉడాయ్‌

Onion Prices Rise: సామాన్యులకు షాకింగ్‌ న్యూస్‌.. మళ్లీ ఘాటెక్కనున్న ఉల్లి ధర..!

Bullet Train Project: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులో ఇండియా రైల్వే మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్!

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..